Friday, July 3, 2009

దాదా

5.
ఈ కవిత మన రాఘవ రావణుడికి అంకితం ...

అందరికి మిత్రుడు మరెందరికో ఆప్తుడు
ఐస్ క్రీముల కాముడు చిరు నవ్వుల భానుడు

వ్యంగ్యంలో వీరుడు చెడు సహించని అసహనుడు
గోపికలుంటే కృష్ణుడు ఈ ఏడడుగుల ఆజానుబావుడు

శోర్యంలో భీముడు కరుణలో రాముడు
హాస్య ప్రియుడు పిచ్చ జోకు బిరుదాంకితుడు

స్వార్ధం ఎరుగని నిస్వార్డుడు త్యాగంలో కర్ణుడి తమ్ముడు
సాముహిక కార్యంలో నిరంతర శ్రామికుడు అసమాన కార్మికుడు

సమస్యల అలలకు కలతలు చెందే సున్నిత మనస్కుడు
బవితలో ఘన చరితను నిర్మించే నవీన భారతీయుడీ రాఘవుడు

* * * * * * * *

ఇంకో చిట్టి కానుక మన మిత్రుడికి ...

మంచిని వెతికే మనసు మన చెంతనుండగా
చెడును వేలెత్తి చూపే అవసరమేమి దండగ !!

ఇట్లు
మీ దాదా ..
============================================
4.
నా మిత్రులు ...

నా మిత్రుల తేనేలోలికించే పలుకులు
అలరించి కవ్వించే స్వాతి ముత్యపు జల్లులు

చిరునవ్వుల హరివిల్లుకు చిరునామా నా మిత్రులు
దివి నుండి భువికి జారవిడిచిన రవి కిరణాలు

కులమతాలకు అతీతులు నా మిత్రులు
ప్రేమ కరణులను జగమంతా పంచె గొప్ప పుత్రులు

ఈర్ష్య అసూయలను అరికట్టే నా మిత్రులు
జ్ఞ్యానతత్వం మానవత్వం జతకట్టే మహోన్నతలు

ధీరులు శూరులు విరాతివీరులు నా ప్రియ మిత్రులు
వెరసి వీరందరూ దేవుడు చేసిన మనుషులు

నా మిత్రులతో నే గడిపిన క్షణాలు
నా జీవిత మదురపు జ్ఞ్యపకాలు


కవిత నా మిత్రులందరికీ అంకితం ...
- దాదా
============================================
3.
ఇది మా ప్రియ నేస్తం కళ్యాణ్ కి అంకితం

మావిచిగురు చూసి ఎడువండ్ ఎవడ్రా బచ్చా
తెలియదా నీకు తొక్కలో బోకు బిచ్చ
బాబు గారు గళం విప్పితే గొప్ప రచ్చ
కళ్యాణ్ గాడంటే మా అందరికి ఉచ్చ

- దాదా
============================================
2.
ప్రసవించెను నాలోని కవి
ఉదయించెను ఇది విని రవి
అలరించెను పసి పాపల చెవి
పులకించెనా సడి లోన భువి
రచించెను గర్వంగా కవి
కరుణించి దీవించెను దివినున్న దేవి

భాష అంటే కాదు అక్షరాల మణిహారం
భాష అంటే మనసులు కలిపే ద్వారం

-దాదా
============================================
1.
ఆపండ్ర మీ కవితల దండ
మెచ్హితిని మీలోని హాస్యపు కొండ
విడిచితిని కవిత ఆగ లేకుండా
ఇకనైనా సెలవియ్యంద్ర మీ ముండ

-- దాదా

No comments:

Post a Comment