Saturday, July 4, 2009

ప్రాపి

============================================

11. ప్రియమిత్రుడు హరి కి జన్మదిన శుభాకాంక్షలతో

స్వరఝరిన ఓలలాడె నీ గాన లహరీ లాహిరి
మిత్ర హృదయ మంజరియై సాగాలి నీ కచేరి
సొగసరి అయినా కాకున్నా పోరిని వదలని ఓ పోకిరీ !
మహనీయుల మార్గమ్మున సాగించు నీ సవారి
గాంధీ నెహ్రూ ల సరసన నిలావాలి నీవు చేరి
నీ జయంతి పసిడిగా చరిత లోన కొలువుదీరి
ఇవ్వాలి మాకు సెలవు విధి తప్పక ప్రతిసారి
ఎంత ఎత్తుకు ఎదిగినా birthday party మరువవు మరి
ఎందుకంటే u are basically Hari!!

- ప్రాస పిడుగు (ప్రాపి)
============================================
10.
మళ్ళీ 11 'అభి' లు... బావ గారికి అంకితం

అభి అంటే అభిప్రాయం - ప్రతి విషయం మీదా కచ్చితమైన అభిప్రాయం
అభి అంటే అభిరుచి - bleach పట్ల అభిరుచి
అభి అంటే అభిమానం - "short" వేసుకోవడం అన్నా short వాళ్ళు (ఇందుర్తి సతీష్ రెడ్డి) అన్నా అభిమానం
అభి అంటే అభ్యర్ధన - వాడిచ్చే పాటలు, సినిమాలూ చూడమని అభ్యర్ధన
అభి అంటే అభిమన్యుడు - హరిత్సా పన్నిన పద్మవ్యూహాం పికాసో లో నించి బయటపడలేని అభిమన్యుడు
అభి అంటే అభ్యాగతుడు - రోజుకో కొ(చె)త్త రెస్టారెంట్ లో అభ్యాగతుడు (చెప్పకుండా వచ్చే అతిథి)
అభి అంటే అభివందనం - 'పూ' అనే పడం తోనే చేస్తాడు అందరికీ అభివందనం
అభి అంటే అభినందన - అనూషిక అందానికి అభినందన
అభి అంటే అభివృద్ధి - badminton లో అనతి కాలంలోనే గురువుని మించేంత అభివృద్ధి
అభి అంటే అభ్యాసం - ఎంతటి కష్టమైన subjects అయినా చేయగల అభ్యాసం
అభి అంటే అభ్యుదయం - AOE, Chess లలో (వీడి ప్రవేశం) దేశానికే అభ్యుదయం

అభి అంటే అభిరామ - మేమందరం అభిమానించే ఒక దున్నపోతు ...

- ప్రాపి (ప్రాస పికాసో)
============================================
9.
ఒక విప్లవ కవిత ..... సాధించు తెలుగోడా

చేతకాని చవట లాగా పని చేయక కూర్చుంటే
వృధా కాద stipend కూర్చొని తింటే
నూరు కోట్ల ప్రజలందరి ఆశలన్ని మనవేంటే
భరతమాత ఋణం తీర్చు మార్గమింక కష్టమొకటే!!

తీరుబడిగా సాగిలపడు సమయమింక లేదు మనకు
ఇప్పుడంటు అప్పుడంటు జాగు చేస్తే వృధా బ్రతుకు
తప్పు నాది కాదు అనకు, నాకు చేత కాదు అనకు
వనరులిక్కడ లేవు అనకు, నడుం కట్టి ముందుకురుకు
తిరుగులేని (100 ఏళ్ళ) చరిత నుండి, ఎదురులేని భవిత వరకు
అలుపులేక ముందుకేగు, తరిగిపోని ప్రగతి కొరకు!!

కలలు కను నిర్భయంగా
ప్రయత్నించు నిర్విరామంగా
నమ్మకముంచు గర్వంగా
శ్రమించు ఇష్టంగా
తడబడు తాత్కాలికంగా
నవ్వులపాలవ్వు దయనీయంగా

అయినా చివరికి సాధించు చారిత్రాత్మకంగా !!

- వస పిట్ట లా వాగే మీ ప్రాస పిట్ట (ప్రాపి)
============================================
8.
ఇది కవిత కాదు ...a sequel

చంచల హిరణి వోలె చెంగున చేదరిపోబోతున్న అందమైన కలను
కనురెప్పల (సాలీడు)వల వేసి నిద్రమత్తు దారము తోడను
పునఃనిర్మించ యత్నించు నాపై ఆ ప్రత్యక్ష దైవము జ్ఞాన తిమిరాల ప్రసరించి
మాయలేడిని సంహరించిన రామబాణము వోలె (ఆ కలపై)నా మమకారాంధకారమును హరించి
"కర్తవ్యమ్ దైవమాన్హికం" అనుచు మోక్ష సోపాన మార్గము చూపె !!

అర్ధాలు:
----------
సోపానము = మెట్టు
హిరణి = లేడి = జింక
ప్రత్యక్ష దైవము = కనిపించే ఏకైక దేవుడు = సూర్యుడు
- ప్రాపి (ప్రాస పిపాసి)
============================================
7.
ఇది కవిత కాదు ...(
భయ పడవద్దు కింద అర్ధాలు భావం ఉన్నాయి)

నిశీధరయైన ఆకాశ వనిత తన చుక్కల దుప్పటిని తొలగించ

ప్రభాత భానుడు తన నుదుటి తిలకము నలంకరించగా నేతెంచ

అపురూప సౌందర్యవతియైన లలనామణి లజ్జావహిత దరహసమువలె ప్రవర్ధమానముగ

నా (కిటికీ యొక్క) ద్వారబంధమును తన దర్శనోద్దిపిక యై ప్రకశింపజేయుచు

స్వప్న ద్వార పాలకులైన నా కనురెప్ప లను కవ్వించెడి కిరణశరములు సంధించి శుభోదయమ్మును పలికె !!

భావము:
-------------
నిశీధర (= చీకటి ని వేసుకున్న/ ధరించిన ) ఆకాశం చుక్కల తో చేసిన తన దుప్పటి ని తొలగిస్తున్నప్పుడు చూసిన సూర్యుడు తనకి నుదుట బొట్టు అలంకరించడానికి మెల్లగా వస్తూ, ఒక అందమైన అమ్మాయి నవ్వితే విధంగా అయితే తన పెదవులు increasingly విచ్చుకుంటాయో, అంతే మెల్లగా నా room కిటికీ కున్న (గాజు)తలుపును తన దర్శనోద్దిపిక(దర్శన + ఉద్దిపిక = దర్శనాన్ని కలిగించే అద్దము ) లాగ ప్రకశింపజేస్తూ నా కలలకు (నేను నిద్ర పోతున్నాను కదా) ద్వార పాలకులైన కను రెప్పలకు కితకితలు పెట్టే కిరణాలనే బాణాలను (కిరణశరములు) వేసి (అంతే నిద్ర లేపి) శుభోదయమ్మును పలికె(good morning చెప్పాడు) ... అదన్నమాట పిశాచి బాధ !!
- ప్రా . పి (ప్రాస పిశాచి)
============================================
6.
వీడు నవ్వితే బొంత కాకి
అంజలి లేదు కనక ఏకాకి
పడతాడో లేదో ఇంకొక పోరిని వెతికి
వీడుంటే చుట్టుపాక్కలంతా చలాకి
పంచ్ బాంబుల తో ఎప్పుడూ మనం perfect కాదని తెస్తాడు గుర్తుకి
కవితా బాంబు లతో చేసాడు సి. ఎస్. ని నాగసాకి
అల్ ది బెస్ట్ రా కన్నా నీ లైఫ్ కి
- ప్రా . పి . (ప్రాస పిచ్చోడు)
============================================
5.
IISc లో తెలుగు వారి అభిమానమున్న
మన వాడు ఆహార్యం లో దున్న
వాడి మంచి మనసు ముందు పనికిరాదు రా వెన్న
నిద్రపోతే వాడు కుంభ కర్నుడికే అన్న

ఎవరికీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా గుర్తొస్తాడు వాడే చటుక్కున
అమ్మాయిల నాడిని పట్టాడు అవపోసన
కాని వాడి జుట్టు మీద పని చేయదు రా దువ్వెన
మనం tour కి వెళ్ళాలంటే ఉండాలి వాడే ప్రతి దిక్కున

మెస్ కమిటి లో పని చేసి ప్రజల ఆకలి తీర్చాలన్నా
తెలుగు సమితి లో ఆహ్లాదకర కార్య క్రమాలు పండాలన్నా
ప్లేస్మెంట్ లో సి. ఎస్. ను ఉద్యోగ సాధన లో ముందు ఉంచాలన్నా
H. P. గాడే మన పాలిటి తిరుమల వెంకన్న !!

- ప్రా . పి . (ప్రాస పిడుగు)
============================================
4.
enough of అంత్య ప్రాస..time for (పేరు తెలియదు) ఇంకో ప్రాస (target == Varma)
రక్ష రక్ష యని శరణు వేడినా దాక్షిణ్యము చూపక
పక్షులు, క్షీరదములు, సాగరాక్షువులను విచక్షణ లేక
రాక్షస వీక్షణముల తోడ వాటిని భక్షణ చేయు
కుక్షి పోషణా ధురన్ధరులకు శిక్షణ ఇచ్చి
ప్రక్షాళన చేసి మోక్షము పొందుటయే మనకి పరీక్ష ??! (మొత్తం 15 క్ష లు)
అర్ధాలు:
సాగరాక్షువులను= సముద్రానికి కళ్ళు = చేపలు, రొయ్యలు మొదలగునవి
కుక్షి = పొట్ట

- చైతు
============================================
3.
సాగుచుండ కవి సమరము సరసంగా
మిత్రజనావళి ని ప్రవర్ధమానముగా అలరింపంగా
ప్రతిసారి tivity అధికమై ప్రవహించంగా
మనలోని ఆశుకవితా కిరణాలు కంప్యూటర్లోకి ప్రసరించంగా
బ్లాగర్ ఏ కృష్ణ రాయల సభారాజము వలె భాసింపంగా
భావ సరస్వతే పని లేని మనని ఆవహించంగా
పైనున్న నన్నయ్య, తిక్కన్న లకే దిమ్మ తిరగంగా
రాయండి కవితలు ప్రజా రంజకంగా !!

-చైతు
============================================

2.
నీ తరమా కవితా ప్రవాహాన్ని ఆపంగా
రాస్తా కవితలు ధారాళంగా
మనసులో భావాలు ఉప్పొంగంగా
నీకేం ప్రాబ్లం రా లంగా!!

-చైతు
============================================
1.
నా పక్కనే నీవుండ
గా మనకెందుకీ రగడ
కవిత్వమా ఎండ
లో నీ మొహం మండ !!
-- చైతు

No comments:

Post a Comment