Friday, July 3, 2009

కేక పెట్టించే కవి

============================================
7.
ప్రియమైన స్నేహితులారా.. !!

ఆస్వాదించాను మీ కవితల జల్లును..
పొందాను ఎంతో థ్రిల్లును
ఇంతటి ప్రేమాభిమానాలు మీకే చెల్లును...
కలకాలం మన స్నేహం వర్ధిల్లును...
దరికి రానీయకండి ఏనాడు కుళ్ళును...
మీ తో వుంటే మరిచిపోతాను ఇల్లును...

- కేక (కేక పెట్టించే కవి)

============================================

6. చాయ్ తాగించే మన భాయ్, ఆలోచిస్తూ పాతికేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భం గా CSA స్టైల్ లో....

అసమానం వీడి భక్తి
అప్రమేయం వీడి ధీయుక్తి
బ్యాడ్మింటన్ లో అద్భుతం వీడి శక్తి,
mixed doubles ఆడేందుకు కడతారు పంక్తి
నవ్వు ఆపుకోలేము వింటే వీడి చలోక్తి
వస్తుంది ఏం చేయాలో అర్థం కాక జీవితం పై విరక్తి,
సింధు అంటే "all of a sudden" గా అంతు లేని ఆసక్తి,
కోరుకుందాం రావాలని త్వరలోనే వీడికి రాఘవన్ నుంచి విముక్తి,

*అప్రమేయం - అర్థం కానిది

- మీ కేక (కేక పెట్టించే కవి)
============================================

5.
( ఎవరికి అంకితమో చెప్పక్కర లేదనుకుంటా....!!!!)

ఎంత వయసైనా వీడేప్పటికి సిటి బాయ్
మరిచిపోలేరేవ్వరు వీడు చెప్పే హాయ్

అంతర, జ్యోతి, అంజలి....
ఇంకెందరికో ఇచ్చాడు పుష్పాంజలి...

కాని ఇప్పటి వరకు కట్టలేదు ఎవరు జోడి
ఏముందని వీడి దగ్గర బోడి

గోళీలు రాలినట్లుందే వీడి నవ్వు
వింటే అదిరి బెదిరి పోతావు నువ్వు

తూర్పు పడమరలను ఒకేసారి చూసే వాడి కాళ్ళు
పట్టాలకు నీల్లోదిలెసిన రైళ్ళు

దెయ్యాలంటే వీడికి చచ్చేంత భయం
పగలు కూడా టార్చి లైటు అడగలేదింకా నయం

మీకు తెలుసా వీడికి సి ఎస్ అందగాడినని ఫీలిం'గని'
చందాలతో కొనిస్తాం, అద్దంలో ముఖం చూసుకోరా మై డియర్ గని

ఏది ఏమైనా మా వాడు కచ్చితంగా కవి
వాడి కవితలకు మేము కోసుకుంటాము చెవి

- కేక (
కే పెట్టించే వి ) మరియు విర (విప్లవ చయిత) అలియాస్ పెద్దన్న
============================================
4.
మీ మనసులు రంజింపగా నేనొచ్చేసా
కొంచెమే అయినా, స్వీటు హాటు తెచ్చేసా

cl1 లో వుంచా బూందీ పాపిడి,
మీరు చేయండి వాటి నిలువు దోపిడి

-
కేక (కే పెట్టించే వి)
============================================
3.
సాగెను కవితలు ఎడతెగని ఏరులై
తీసేను మన వాళ్ళు కలములు వీరులై
ప్రయోగాలు కుసుమించేను సుందర విరులై
మనసును హత్తుకొనే మకరంద మరులై
నా ధాటి కి తట్టుకోలేక ఆగెదరా భీరులై
లేక చూపెదరా మీ యుక్తి ధీర శురులై

- హరి
============================================
2.
దీనికి రిప్లై ఇస్తే పగులుద్ది నీ గుండు..
కనుక నోరు మూసుకు వుండు....
తినేసాక పారెయ్యాలి తొక్క అఫ్ పండు...
ఇది నా కవిత నెంబరు రెండు....

-- హరి
============================================
1.
ప్రియ నేస్తమా ??
నా ముందు మౌనమా..??
లేక పోతే నీకేమైనా రోగమా...??
దిక్కులు చూడక ఇది వినుమా...??
ఎలా వుంది నిన్నటి సినిమా ???

-- హరి






No comments:

Post a Comment