============================================
అడుగు పెట్టాను ఏనుగు లా
కానీ ఇప్పుడు ఫీల్ అవుతున్నాను అరటి తొక్క లా
ఇక అడ్డు రానీ ఒక కొండ, అడ్డు రాని సముద్రం
ఇక వెను తిరిగేది లేదు.. ఇదే నా ధైర్యం
- భాయ్
============================================
============================================
2.
ఒక ప్రియుడు తన ప్రేయసి తో గొడవపడి ఇలా అన్నాడు దిక్కు తోచక ........
నాకు దొరికింది ఒక గర్ల్ ఫ్రెండ్ లేక లేక
చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నాం ఎంచక్కా
కానీ దానికి ఉంది తల తిక్క
దాంతో తిరిగితే నా జేబుకు బొక్క
ఇది, వాళ్ళ అయ్యాకి తెలిస్తే తీస్తాడు నా తొక్క, చించుతాడు నా డొక్కా
అయినా వోదిలించుకోలేక పోతున్నా..... ఇంకో గర్ల్ ఫ్రెండ్ దొరక్క
---సాయి
============================================
1.
ఎం రో మాకు రావనుకున్నర
శురు చేసిన
ఆపండ్ర మీ లోలోని లొల్లిని
లేకపోతే తీస్తా నా లోనీ కలాన్నీ
వినలేక ముసుకుంటారు మీ చెవుల్ని
నాతో పెట్టుకుంటే మూసి నదిలో ముంచేస్తా మిమ్మల్ని
- అబ్బ ఛా
============================================
3.
ఓ స్నేహమా గుర్తుందా! మన తియ్యటి పరిచయం,
అనురాగానికి అర్థం "నీవు", ఆప్యాయతలో పరమార్ధం "నీవు",
నా చిరునవ్వుకు ప్రేరణ "నీవు" , నా గుండె ప్రతి సవ్వడిలో "నీవు",
నా కలలకు జ్ఞాపకం "నీవు", కాలానికి ఆతీతం "నీవు",
నా జీవితానికి హరివిల్లువు "నీవు", స్నేహానికి చిహ్నం "నీవు",
నా ఆనందానికి కారణం "నీవు", ఈ కవితకి ప్రాణం "నీవు".
-- రెడ్డన్న
============================================
2.
గణేష్ హృదయ చకోరం వలచింది, ఒక వెన్నల హృదయాన్ని,
ఆ చిరువెన్నెల తనదే నని మురిసింది మై మరిచింది.
కాలమంతా ఆ వెన్నల కోసం పరుగులు తీసింది.
చివరకు అది అందలేదని, అందుకోలేనని,
ఒంటరిగ మిగిలింది, వేదనతో కుమిలింది, పాపం.
-రెడ్డన్న.
============================================
1.
మౌనం నుండి జిమెయిల్ కి దిగివచ్చిన హరి
అయ్యాడు ఒక కవి
పంపాడు చూడచక్కని ఓ తవి
ఇది చదివి చితపట లాడదు అతని మైతు, చైతు
వీరి బాధతో ఆప్రసంతుడయ్యాడు మా ప్రశాంత్
చాలు ఆపండి అని ఆరిసాదు ఫని లేక, ఓ ఘని
ఇవన్ని చదవలేఖ అయ్యాను నేను ఈ రోజు శని.
- రెడ్డన్న
స్వరఝరిన ఓలలాడె నీ గాన లహరీ లాహిరి
7.
మన దాదా...
విశ్లేషణకు మించిన విశ్లేషకుడు
సందర్భానుసారంగా చలోక్తులు విసిరే చాకచక్యుడు
అత్యవసర సమయంలో తెలివిని ప్రదర్శించేటోడు
తను వెనకాలే ఉంటూ ముందుకు నడిపేటోడు
మౌనంగా ఉంటూనే మనసులను పసికట్టేటోడు
నటనలో నాగార్జున అంతటోడు
దాదాగిరిలో శంకర్ దాదా అంతటోడు
అమ్మాయిల విషయంలో నీటిలో ఉన్న ఎనుగులాంటోడు
ధందాలో నేల మీద ఉన్న మోసలిలాంటోడు
నీతోనే ఉన్నా అనే ఒక మెత్తని వంచకుడు
చాపకింద నీరులా తన పని తాను చేసుకునేటోడు
తెలంగాణ కోసం ఓటుని స్నేహం కోసం పర్సుని ఇచ్చేటోడు
అందరి హృదయాలను దోచుకున్నోడు
ఆ ఒక్కడు... మన దాదా గాడు
- క.క (కచ్చితంగా కవి)
- గని
============================================
వాడు సామాన్యుడు కాదు...
వాడు మనలో ఒకడు!! కాని మన వాడు కాదు...
వాడు ఆపదలో ఆదుకుంటాడు!! కాని మన బందువు కాదు...
వాడు మన గుండెల్లో వుంటాడు!! కాని మన మిత్రుడు కాదు...
వాడు మన పోరిని వాడుకుంటాడు!! కాని మన శత్రువు కాదు...
వాడు మాటలతో మాయ చేస్తాడు!! కాని మాయలోడు కాదు...
వాడు అన్నిటా మంచివాడు!! కాని చెడ్డవాడు కాదు...
వాడు కలియుగ కృష్ణుడు!! కాని దేవుడు కాదు...
వాడు పొట్టివాడు కాదు...
వాడు నల్లవాడు కాదు...
వాడు సామన్యుడు కాదు...
ఈ తవిక, నా కవి మిత్రుడు హెచ్.పి.లకు అంకితం....-కక (కచ్చితంగా కవి ).- గని
2.
దీనికి రిప్లై ఇస్తే పగులుద్ది నీ గుండు..
కనుక నోరు మూసుకు వుండు....
తినేసాక పారెయ్యాలి తొక్క అఫ్ పండు...
ఇది నా కవిత నెంబరు రెండు....
-- హరి
ఓ ప్రియ నేస్తమా ??
నా ముందు మౌనమా..??
లేక పోతే నీకేమైనా రోగమా...??
దిక్కులు చూడక ఇది వినుమా...??
ఎలా వుంది నిన్నటి సినిమా ???
-- హరి