Saturday, August 1, 2009

మనం వెనుక (We are Back)

============================================
55.

ప్రియమైన స్నేహితులారా.. !!
ఆస్వాదించాను మీ కవితల జల్లును..
పొందాను ఎంతో థ్రిల్లును
ఇంతటి ప్రేమాభిమానాలు మీకే చెల్లును...
కలకాలం మన స్నేహం వర్ధిల్లును...
దరికి రానీయకండి ఏనాడు కుళ్ళును...
మీ తో వుంటే మరిచిపోతాను ఇల్లును...

- కేక (కేక పెట్టించే కవి)

============================================

54. అందరికి ప్రీతీ పాత్రుడైన హరికి జన్మదిన శుభాకాంక్షలతో .. ఈ చిన్ని కవిత

సాగించు ఈ మార్గదర్శి జీవితంలో నీ ప్రయాణం
తరగకుండా ఎటువంటి ప్రమాణం

నీ అండ ఉంటె మాకు లేదు ఎటువంటి ప్రమాదం [:P]
నువ్వు చీకటి గుండెల్లో వెలుగునిచ్చే ప్రమిదం
నీతో గడిపిన iisc లైఫ్ అందరికి ప్రమోదం
నీ వ్యక్తిత్వానికి కావాలి సిసలయిన ప్రబోధం
నీ కవిత్వం అవ్వాలి ప్రబంధం
నీ మీద ఎవ్వరకు కలుగదు ప్రతిశోదం
నువ్వు మా అందరికి ఆ "హరి ప్రసాదం" !!

-- పేక

============================================
53.
ప్రియమిత్రుడు హరి కి జన్మదిన శుభాకాంక్షలతో

స్వరఝరిన ఓలలాడె నీ గాన లహరీ లాహిరి
మిత్ర హృదయ మంజరియై సాగాలి నీ కచేరి
సొగసరి అయినా కాకున్నా పోరిని వదలని ఓ పోకిరీ !
మహనీయుల మార్గమ్మున సాగించు నీ సవారి
గాంధీ నెహ్రూ ల సరసన నిలావాలి నీవు చేరి
నీ జయంతి పసిడిగా చరిత లోన కొలువుదీరి
ఇవ్వాలి మాకు సెలవు విధి తప్పక ప్రతిసారి
ఎంత ఎత్తుకు ఎదిగినా birthday party మరువవు మరి
ఎందుకంటే u are basically Hari!!

- ప్రాస పిడుగు (ప్రాపి)

============================================
52.

చాయ్ తాగించే మన భాయ్, ఆలోచిస్తూ పాతికేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భం గా CSA స్టైల్ లో....
అసమానం వీడి భక్తి
అప్రమేయం వీడి ధీయుక్తి
బ్యాడ్మింటన్ లో అద్భుతం వీడి శక్తి,
mixed doubles ఆడేందుకు కడతారు పంక్తి
నవ్వు ఆపుకోలేము వింటే వీడి చలోక్తి
వస్తుంది ఏం చేయాలో అర్థం కాక జీవితం పై విరక్తి,
సింధు అంటే "all of a sudden" గా అంతు లేని ఆసక్తి,
కోరుకుందాం రావాలని త్వరలోనే వీడికి రాఘవన్ నుంచి విముక్తి,

*అప్రమేయం - అర్థం కానిది

- మీ కేక (కేక పెట్టించే కవి)

============================================

51. కచితంగా కవి అందించిన ఆణిముత్యం

దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు... కామెడి కోసం ఇలా రాసనంతే. -కచ్చితంగా కవి.

1. "యంగ్ స్టార్" సత్తి నటించిన తొలి చిత్రం "చంటి పిల్లాడు (success story of a kid)" బాక్సపిసు వద్ద మంచి హిట్ అయింది. దానితో మన యంగ్ స్టార్ రెట్టించిన ఉత్సాహంతో నటించిన రెండవ చిత్రం "ఆంద్ర కుర్రాడు... ఒరిస్సా ఆంటీ" విడుదలకు సిద్దంగా వుంది.

2. "డేరింగ్ స్టార్" దాదా చాల విరామం తర్వాత నటిస్తున్న భారి బడ్జెట్ మూవీ "నన్ను నమ్ముకో... ఉన్నది అమ్ముకో... " కి బడ్జెట్ సరిపోకపోవడంతో అర్థాంతరంగా ఆగిపోయిన సినిమా షూటింగ్.

3. "బోల్డ్ స్టార్" బాబాయ్ నటించిన మూడవ చిత్రం "పాప దొరికింది... పర్స్ పోయింది" తన కెరీర్ లో పెద్ద హిట్ అని తెలుసు. ఈ సినిమాకి సిక్వెల్ గా వస్తున్న చిత్రం పేరు "పర్స్ తో పనేంటి" అని కరారు చేసారు.

4. "ఆంధ్ర కృష్ణుడు" హరి నటించిన రొమాంటిక్ మూవీ "చెద్దరు తెచ్చిన ముప్పు"కి ఇంకా ధియేటర్ల దగ్గర రద్దీ తగ్గలేదు. దర్శకుడు దోస జగన్నాథ్ తో మరో action thriller మూవీ "పెళ్లి నీది... కాపురం నాది " కి ముహూర్తం కరారైంది.

5. స్టోరీల ఎంపిక విషయంలో ఎప్పుడూ confuse అయ్యే మన confusion star అర్షద్ భాయ్ ఫిక్షన్ మూవీ "అంతులేని ఆలోచన (infinite thinking)" విడుదల తేది ఇంకా కరారు కాలేదు.

6. "వెరైటి హీరో" వర్మ నటించిన "కిచెన్ లో కాపురం పెడతా" అంతగా ప్రేక్షకుల మెప్పు పొందలేదు. తను రాసుకున్న కథకు దర్శకులు ముందుకురాకపోవడంతో, తన స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం "నేను తిన్న బొచ్చు బిర్యాని కథ" నిన్న రామోజీ ఫిలిం సిటీలో లాంచనంగా షూటింగ్ ప్రారంభమైంది.అల్ టైం హీరో చైతు మొదటి క్లాప్ ఇచ్చారు. ఈ చిత్రానికి నిర్మాత మన బోల్డ్ స్టార్ బాబాయి కావటం విశేషం.

7. "Expressions king" prince కల్లు నటించిన "కల్తిలేని కొత్త ప్రేమ" ఫ్లాప్ కావటంతో తన తదుపరి చిత్రం "B" మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సినిమా షూటింగ్ పూర్తి అయింది, వచ్చేనెల మొదటి వారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కోసం కల్లు సంప్రదాయక నృత్యాలతో పాటు హిప్ హాప్, సల్సా, టాంగో,బ్రేక్ డాన్స్ , జిగ్గింగ్, బాల్లెట్ వంటి అన్ని రకాల వెస్ట్రన్ డాన్స్ ఎంతో కష్టపడి నేర్చుకున్నారు.

8. "ఆల్ టైం హీరో" చైతు నటించిన "ఎంత సేపైనా తింటా " సినిమా స్టొరీలైన్ క్లిష్టంగా ఉండడంతో మళ్ళి ధియేటర్ కి వస్తున్న జనాలు.

9. "ఫ్యామిలీ స్టార్" సత్తి పండు నటించిన కొత్త చిత్రం "నేను బడికి పోతా!" డబ్బింగ్ పూర్తి కావస్తుంది.

10. సరదాగా సాగిపోయే కథాంశంతో నిర్మించిన చిత్రం "నువ్వు...నేను... కప్ ఐస్ క్రీం!" రెడి ఫర్ రిలీస్.

11. "ఆ అమ్మాయి నన్నే చూస్తుంది", "అందాల అబ్బాయి... వేధించే అమ్మాయిలు" వంటి చిత్రాల ద్వార "లవర్ బాయ్" గా పేరు తెచుకున్న "బాల భాయ్" తన మాస్ ఇమేజ్ పెంచుకోటానికి ప్రయత్నిస్తున్న చిత్రం "తోడ మీద ఒట్టు... తోలు తీస్తా" రేపే షూటింగ్ ప్రారంభం.

12. "ఏయ్... ఒరేయ్... నాది కూడా చూడండిరా." సినిమా ఆడియో నిన్న తాజ్ హోటల్ లో రిలీస్ అయ్యింది.

కొంచం ఉప్పు , కారం

తాజా వార్త.. ఫ్యామిలీ స్టార్ సతీష్ గారి సినిమా పేరు "నేను ISB కి పోతా" అని మార్చడమైనది

"బోల్డు స్టార్ " బాబాయ్ సిని చరిత్ర లో మలుపు కావనున్న సినిమా "మహానగరం లో ఒంటరి" , త్వరలో విడుదలకు సిద్ధం కానుంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక బాబాయ్ పర్సు కి పని పడుతుందని ప్రేక్షకుల అభిప్రాయం...

============================================
50. Yeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee !!!!

తెలుగు వీరా నిదుర లే!!!

తల్లి తండ్రులు ఆనంద భాష్పాలు రాల్చేలా
తోటి మిత్రులు గర్వపడేలా
శత్రువులు తల్లడిల్లెలా
ప్రపంచం దద్దరిల్లేలా

ప్రపంచాన్ని సుడిగాలి వేగం తో ఎదురుకుందాం
ప్రపంచ చరితనే తిరగరాద్దాం

తెలుగోడి పొగరు ఇదే
తిరిగిచూడకు నీ మార్గమిదే!!

నువ్వు తలచుకుంటే కానిదేది లేదని
అష్టైశ్వర్యాలు ఘనులు నీ వాకిట రావాలి అని
నీ కధ నలుగురు చెప్పుకోవాలి
నీ ఒక్క మాట మీద చర్చలు జరగాలి

నలుగురికి విశ్వాసం పంచేలా
నలుగురికి స్పూర్తినిచ్చేలా
నలుగురికి చేతనయిన సాయం చేసేలా
నలుగిరి కోసం బ్రతికి పురుషార్ధం పొందు ధీరుడిలా , వీర పురుషుడిలా

నే మాటలకు అంకితం కాదంటూ
నే చేసిన పని సామాన్యం కాదంటూ
కావాలి ప్రపంచానికి కనువిప్పు
మాటలతో కాదు కేవలం చేతలతో చెప్పు

నీ మాతృభూమి కాదా నీ కన్న తల్లితో సమానం
నీ తపన నరాల్లోకి ఇంకి పోవాలి నీ తల్లి కోసం
కావాలి నీ ప్రయత్నం నూరు శాతం
ఇంకెంత తక్కువైనా ఆ నేరం విపరీతం

ఇది ధర్మ యుద్ధం, ప్రతి రోజు కావాలి పోరాటం
లక్ష్య సాధనే నీ కర్తవ్యం
ప్రతి ఒక్కరికి చెప్పిపో నీ సందేశం

ఆరంభమిది అంతం కాదు
అని గ్రహించి .... ఓ తెలుగు వీరా
నువ్వు నిదుర లేరా!!!

- పేక
============================================

49.
ఓ స్నేహమా గుర్తుందా! మన తియ్యటి పరిచయం,
అనురాగానికి అర్థం "నీవు", ఆప్యాయతలో పరమార్ధం "నీవు",
నా చిరునవ్వుకు ప్రేరణ "నీవు" , నా గుండె ప్రతి సవ్వడిలో "నీవు",
నా కలలకు జ్ఞాపకం "నీవు", కాలానికి ఆతీతం "నీవు",
నా జీవితానికి హరివిల్లువు "నీవు", స్నేహానికి చిహ్నం "నీవు",
నా ఆనందానికి కారణం "నీవు", ఈ కవితకి ప్రాణం "నీవు".

-- రెడ్డన్న

============================================
48.
ఈ కవిత ఒకరి జన్మదిన కానుక ..
కాని ఈ ప్రయత్నానికి తగిన పేరు రాలేదు ..
కనీసం మన blog లోకి అయిన పనికి వస్తుందని ఆశిస్తున్నాను.

చిరునవ్వుతో పలుకుతుంది ఆహ్వానం
మెండుగా ఉంది తనలో ఆత్మాభిమానం
నలుగురికి సహాయం చేసే గుణం
దాన ధర్మములకు సంఖోచించదు క్షణం
మిత్రులకు తోడ్పడే స్వభావం
మా అందరిపై ఉంటుంది తన ప్రభావం

అందం చందం, తెలివి చదువు
అరుదైన వనితకు ఇవన్నియును కలవు
తన విచక్షణకు లేదు సెలవు
కల్ల నిజములు కనిపెట్టుట తనకెంతో సులువు

తన శైలి వేరు
తన మనసుకి దారి వేరు
తన మాటలు ప్రవహించే సెలయేరు
తన చూపులకు జనులు ముగ్దులయ్యేరు

కోపం వస్తే హరి హరి
అవుతుంది మన పని సరాసరి

తన మార్గము స్ఫూర్తినిచ్చు
అది కన్న ఎవ్వరైన మెచ్చు

నీ పరిచయం పంచెను ఆనందపు జల్లులు
విరిశాయి మనసంతా రంగుల హరివిల్లులు
అధిగమించగలవు ఎట్టివైనా కాలం పెట్టిన పరీక్షలు
అని ఆసిస్తూ , నీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు

-- పేక

============================================

47.
ఈ కవిత వీర శూర కర్ణుడికి అంకితం

వినర వినర ఓ వీర పురుషుడి
కధ
అడుగడుగునా శాప గ్రస్తుడైన ఓ క్షత్రియుడి
వ్యధ

లోకం కనీ విని ఎరుగని దాన వీరుడు
ఇంద్రుడికి సైతం దాన మిచ్చిన దయార్ధ హృదయుడు

రాధేయుడిగా పరిచయమై, సూద్రుని పుత్రుడుగా వ్యాప్తమై
అవమానం భరించెను , కీర్తికై తన మనస్సు తపించెను

పరశురాముడి శిష్యుడు , ఈతండు ధనుర్విద్యలో సర్వశ్రేష్టుడు
ఇతడు సంధించిన శరం కడు వేగం,
అర్జునునికి లేదు వాటికి సమాధానం

అంగ రాజ్యానికి నరేశుడై సుయోధనుడికి రుణబద్ధుడు ,
అధర్మ పక్షాన ధర్మయుద్ధంలో పరాజితుడైన శాపగ్రస్తుడు

అర్జునుడు చేసెను కపటము , ఇతను పలికెను వీరస్వర్గమునకు స్వీకారము
రణరంగంలో ఓ మహావీరుడు నేలకూలేను , అది చూచి
ముల్లోకాలు తల్లడిల్లెను

ఆతండి స్నేహభావం కావాలి మనకి ఆదర్శం
విషపూరితమైన నేటి సమాజంలో కర్ణ నామమే మన నినాదం

-- పేక (పేరు లేని కవి)
============================================
46.
గణేష్ హృదయ చకోరం వలచింది, ఒక వెన్నల హృదయాన్ని,
చిరువెన్నెల తనదే నని మురిసింది మై మరిచింది.
కాలమంతా వెన్నల కోసం పరుగులు తీసింది.
చివరకు అది అందలేదని, అందుకోలేనని,
ఒంటరిగ మిగిలింది, వేదనతో కుమిలింది, పాపం.
-రెడ్డన్న.
============================================
45.
మళ్ళీ 11 'అభి' లు... బావ గారికి అంకితం

అభి అంటే అభిప్రాయం - ప్రతి విషయం మీదా కచ్చితమైన అభిప్రాయం
అభి అంటే అభిరుచి - bleach పట్ల అభిరుచి
అభి అంటే అభిమానం - "short" వేసుకోవడం అన్నా short వాళ్ళు (ఇందుర్తి సతీష్ రెడ్డి) అన్నా అభిమానం
అభి అంటే అభ్యర్ధన - వాడిచ్చే పాటలు, సినిమాలూ చూడమని అభ్యర్ధన
అభి అంటే అభిమన్యుడు - హరిత్సా పన్నిన పద్మవ్యూహాం పికాసో లో నించి బయటపడలేని అభిమన్యుడు
అభి అంటే అభ్యాగతుడు - రోజుకో కొ(చె)త్త రెస్టారెంట్ లో అభ్యాగతుడు (చెప్పకుండా వచ్చే అతిథి)
అభి అంటే అభివందనం - 'పూ' అనే పడం తోనే చేస్తాడు అందరికీ అభివందనం
అభి అంటే అభినందన - అనూషిక అందానికి అభినందన
అభి అంటే అభివృద్ధి - badminton లో అనతి కాలంలోనే గురువుని మించేంత అభివృద్ధి
అభి అంటే అభ్యాసం - ఎంతటి కష్టమైన subjects అయినా చేయగల అభ్యాసం
అభి అంటే అభ్యుదయం - AOE, Chess లలో (వీడి ప్రవేశం) దేశానికే అభ్యుదయం

అభి అంటే అభిరామ - మేమందరం అభిమానించే ఒక దున్నపోతు ...

- ప్రాపి (ప్రాస పికాసో)
============================================
44.
అవసరం ఏంటి ???

నీ పాపములను తొలగించేదను... నేను పాపములు చేయలేదు.
నిన్ను కష్టములనుంచి రక్షించేదను... నేను కష్టాలలో లేను.
నీకు సహాయము చేసెదను... నేను నా పని చేసుకోగలను.
నీకు శాంతిని కలిగించేదను... నేను ప్రశాంతగానే ఉన్నాను.

నేను విన్న ఒక చిన్న కథ:
ఒక దయహృదయుడు, కరుణామయుడు సహాయము చేయాలనే మంచి మనసు కలవాడు ఒక రోజు తన చుట్టూతాను గూడు కట్టుకుంటున్న ఒక పట్టు పురుగుని చూసాడు. అది చూసినా అతను పట్టు పురుగు ఎందులోనోచిక్కుకుంటున్నదని భావించి గూడుని తొలగించాడు. ప్రకృతి విరుద్దంగా జరిగిన చర్య వలన పట్టుపురుగుచనిపోయినది. అతను చేయదలుచుకున్న సహాయం ఉపయోగపడకపోగా పట్టుపురుగు ప్రాణాలను బలితీసింది.

నీతి: బలవంతంగా, అడగకపోయినా సహాయం చేయడం మంచిది కాదు. మనం చూపించే అధిక ప్రేమ వేరేవాళ్ళ అబివృద్దికి అడ్డం కావచ్చు.

-కక(కచ్చితంగా కవి).
============================================
43.
మరిచిపో... మరిచిపోకు...

నీ బలహీనతను మరిచిపో ! నీ బలాన్ని మరిచిపోకు !!
నిజంకాని కలలను మరిచిపో ! కలలు కనటం మరిచిపోకు !!
స్టార్టప్ ఫెయిల్ అయితే మరిచిపో ! ఇంకో స్టార్టప్ పెట్టాలనేది మరిచిపోకు !!
జీవితంలో ఫెయిల్ అయితే మర్చిపో ! మిగిలిన జీవితాన్ని మరిచిపోకు!!

నీకు జరిగిన మోసం మరిచిపో ! నువ్వు చేసిన మోసం మరిచిపోకు !!
మిత్రుడు చేసిన ద్రోహం మరిచిపో ! అతను పంచిన ప్రేమను మరిచిపోకు !!
ఒకరి ప్రేమలో ఫెయిల్ అయితే మరిచిపో ! ఇంకోక్కరిని ప్రేమించాలని మరిచిపోకు !!

ఓటమిని మరిచిపో ! గెలవాలని మరిచిపోకు !!
చెడుని మరిచిపో ! మంచిని మరిచిపోకు !!
ద్వేషించడం మరిచిపో ! ప్రేమించడం మరిచిపోకు !!
అన్ని మరిచిపో ! నిన్ను నువ్వు మరిచిపోకు !!

-కక(కచ్చితంగా కవి).
============================================
42.
( ఎవరికి అంకితమో చెప్పక్కర లేదనుకుంటా....!!!!)

ఎంత వయసైనా వీడేప్పటికి సిటి బాయ్
మరిచిపోలేరేవ్వరు వీడు చెప్పే హాయ్

అంతర, జ్యోతి, అంజలి....
ఇంకెందరికో ఇచ్చాడు పుష్పాంజలి...

కాని ఇప్పటి వరకు కట్టలేదు ఎవరు జోడి
ఏముందని వీడి దగ్గర బోడి

గోళీలు రాలినట్లుందే వీడి నవ్వు
వింటే అదిరి బెదిరి పోతావు నువ్వు

తూర్పు పడమరలను ఒకేసారి చూసే వాడి కాళ్ళు
పట్టాలకు నీల్లోదిలెసిన రైళ్ళు

దెయ్యాలంటే వీడికి చచ్చేంత భయం
పగలు కూడా టార్చి లైటు అడగలేదింకా నయం

మీకు తెలుసా వీడికి సి ఎస్ అందగాడినని ఫీలిం'గని'
చందాలతో కొనిస్తాం, అద్దంలో ముఖం చూసుకోరా మై డియర్ గని

ఏది ఏమైనా మా వాడు కచ్చితంగా కవి
వాడి కవితలకు మేము కోసుకుంటాము చెవి

- కేక (
కే పెట్టించే వి ) మరియు విర (విప్లవ చయిత) అలియాస్ పెద్దన్న
============================================
41.
మీ మనసులు రంజింపగా నేనొచ్చేసా
కొంచెమే అయినా, స్వీటు హాటు తెచ్చేసా

cl1 లో వుంచా బూందీ పాపిడి,
మీరు చేయండి వాటి నిలువు దోపిడి

-
కేక (కే పెట్టించే వి)
============================================
40.
ఈ కవిత మన రాఘవ రావణుడికి అంకితం ...

అందరికి మిత్రుడు మరెందరికో ఆప్తుడు
ఐస్ క్రీముల కాముడు చిరు నవ్వుల భానుడు

వ్యంగ్యంలో వీరుడు చెడు సహించని అసహనుడు
గోపికలుంటే కృష్ణుడు ఈ ఏడడుగుల ఆజానుబావుడు

శోర్యంలో భీముడు కరుణలో రాముడు
హాస్య ప్రియుడు పిచ్చ జోకు బిరుదాంకితుడు

స్వార్ధం ఎరుగని నిస్వార్డుడు త్యాగంలో కర్ణుడి తమ్ముడు
సాముహిక కార్యంలో నిరంతర శ్రామికుడు అసమాన కార్మికుడు

సమస్యల అలలకు కలతలు చెందే సున్నిత మనస్కుడు
బవితలో ఘన చరితను నిర్మించే నవీన భారతీయుడీ రాఘవుడు

* * * * * * * *

ఇంకో చిట్టి కానుక మన మిత్రుడికి ...

మంచిని వెతికే మనసు మన చెంతనుండగా
చెడును వేలెత్తి చూపే అవసరమేమి దండగ !!

ఇట్లు
మీ దాదా ..
============================================
39.
ఒక విప్లవ కవిత ..... సాధించు తెలుగోడా

చేతకాని చవట లాగా పని చేయక కూర్చుంటే
వృధా కాద stipend కూర్చొని తింటే
నూరు కోట్ల ప్రజలందరి ఆశలన్ని మనవేంటే
భరతమాత ఋణం తీర్చు మార్గమింక కష్టమొకటే!!

తీరుబడిగా సాగిలపడు సమయమింక లేదు మనకు
ఇప్పుడంటు అప్పుడంటు జాగు చేస్తే వృధా బ్రతుకు
తప్పు నాది కాదు అనకు, నాకు చేత కాదు అనకు
వనరులిక్కడ లేవు అనకు, నడుం కట్టి ముందుకురుకు
తిరుగులేని (100 ఏళ్ళ) చరిత నుండి, ఎదురులేని భవిత వరకు
అలుపులేక ముందుకేగు, తరిగిపోని ప్రగతి కొరకు!!

కలలు కను నిర్భయంగా
ఆశించు తెలివి తక్కువగా
ప్రయత్నించు నిర్విరామంగా
నమ్ము నిన్ను గర్వంగా
శ్రమించు ఇష్టంగా
తడబడు కొంచెంగా
నవ్వులపాలవ్వు దయనీయంగా
చివరికి సాధించు చారిత్రాత్మకంగా !!

- వస పిట్ట లా వాగే మీ ప్రాస పిట్ట (ప్రాపి)
============================================
38.
ఇది కవిత కాదు ...a sequel

చంచల హిరణి వోలె చెంగున చేదరిపోబోతున్న అందమైన కలను
కనురెప్పల (సాలీడు)వల వేసి నిద్రమత్తు దారము తోడను
పునఃనిర్మించ యత్నించు నాపై ఆ ప్రత్యక్ష దైవము జ్ఞాన తిమిరాల ప్రసరించి
మాయలేడిని సంహరించిన రామబాణము వోలె (ఆ కలపై)నా మమకారాంధకారమును హరించి
"కర్తవ్యమ్ దైవమాన్హికం" అనుచు మోక్ష సోపాన మార్గము చూపె !!

అర్ధాలు:
----------
సోపానము = మెట్టు
హిరణి = లేడి = జింక
ప్రత్యక్ష దైవము = కనిపించే ఏకైక దేవుడు = సూర్యుడు
- ప్రాపి (ప్రాస పిపాసి)
============================================
37.
ఇది కవిత కాదు ...(
భయ పడవద్దు కింద అర్ధాలు భావం ఉన్నాయి)

నిశీధరయైన ఆకాశ వనిత తన చుక్కల దుప్పటిని తొలగించ

ప్రభాత భానుడు తన నుదుటి తిలకము నలంకరించగా నేతెంచ

అపురూప సౌందర్యవతియైన లలనామణి లజ్జావహిత దరహసమువలె ప్రవర్ధమానముగ

నా (కిటికీ యొక్క) ద్వారబంధమును తన దర్శనోద్దిపిక యై ప్రకశింపజేయుచు

స్వప్న ద్వార పాలకులైన నా కనురెప్ప లను కవ్వించెడి కిరణశరములు సంధించి శుభోదయమ్మును పలికె !!
- ప్రా . పి (ప్రాస పిశాచి)

భావము:
-------------
నిశీధర (= చీకటి ని వేసుకున్న/ ధరించిన ) ఆకాశం చుక్కల తో చేసిన తన దుప్పటి ని తొలగిస్తున్నప్పుడు చూసిన సూర్యుడు తనకి నుదుట బొట్టు అలంకరించడానికి మెల్లగా వస్తూ, ఒక అందమైన అమ్మాయి నవ్వితే విధంగా అయితే తన పెదవులు increasingly విచ్చుకుంటాయో, అంతే మెల్లగా నా room కిటికీ కున్న (గాజు)తలుపును తన దర్శనోద్దిపిక(దర్శన + ఉద్దిపిక = దర్శనాన్ని కలిగించే అద్దము ) లాగ ప్రకశింపజేస్తూ నా కలలకు (నేను నిద్ర పోతున్నాను కదా) ద్వార పాలకులైన కను రెప్పలకు కితకితలు పెట్టే కిరణాలనే బాణాలను (కిరణశరములు) వేసి (అంతే నిద్ర లేపి) శుభోదయమ్మును పలికె(good morning చెప్పాడు) ... అదన్నమాట పిశాచి బాధ !!

============================================
36.
ఇది నా ప్రియ మిత్రుడు సాయి కి అంకితం

ముఖ కవళికల్లో పసి పాపాయి
వాడికి శృతి అంటే హాయి

వినండి వాడి పసి పలుకులు
రుజువు ఇదే వాడి "ఎం జేస్తుల్లు " !!!

-- పేక
============================================
35.
ఇది కాదు కవులకు సవాలు
కేవలం చించి వేసే రుమాలు

ఎవడికి తెలియదు చెప్పు
వాడు మన దాదా ఏమంటావు 'నీ మొఖం లో నా చెప్పు' !!
-వర్మలు.
============================================
34.

నడక హంస నడక
వాడి జుట్టు సాలీడు బూజు
వాడి బుసర్టు రంగు రంగుల నంబర్లు
వాడి ఒళ్ళంతా వంకర టింకర
అమ్మాయిలను చుస్తే అవుతాడు టింకర వంకర
చేస్తాడు పనులు బుల్లెట్లు వేగంతో
నీకు తెలియక పోతే వాడికి అంతా తెలుసు
నీకు తెలిస్తే వాడికి ఏమి తెలియదు
వాడు వింటాడు ప్రతి ఒక్కరిని ఓపికగా అదో పిచ్చి వాడికి
ఎప్పుడు రూంలో ఏదో నడుపుతుంటాడు
మన అందరికి పిచ్చోడుల కనిపిస్తాడు
కానీ రాస్తాడు పేపర్ల మీద పేపర్లు
వాడికి వున్నాడు ఒకడు పోటి వాడి గురించి రాస్తాను మల్లి
ప్రస్తుతానికి వీడు ఎవడో చెప్పోకోండి
ఇది మీ CSA శతకం కవులు అందరికి నా సవాలు..................

ఇట్లు........
నీ మొకం లో నా చెప్పు.
============================================
33.
వీడు నవ్వితే బొంత కాకి
అంజలి లేదు కనక ఏకాకి
పడతాడో లేదో ఇంకొక పోరిని వెతికి
వీడుంటే చుట్టుపాక్కలంతా చలాకి
పంచ్ బాంబుల తో ఎప్పుడూ మనం perfect కాదని తెస్తాడు గుర్తుకి
కవితా బాంబు లతో చేసాడు సి. ఎస్. ని నాగసాకి
అల్ ది బెస్ట్ రా కన్నా నీ లైఫ్ కి
- ప్రా . పి . (ప్రాస పిచ్చోడు)
============================================
32.
ధీరులు శూరులు అవ్వుదురో కాదో
తేనె పలుకులు ఉన్నవో లేవో

భలే ఉంది మన దాదా 'మిత్రులు'
ఇదే మీకు నా రామ నవమి శుభాకాంక్షలు !!
- పేక
============================================
31.
నా మిత్రులు ...

నా మిత్రుల తేనేలోలికించే పలుకులు
అలరించి కవ్వించే స్వాతి ముత్యపు జల్లులు

చిరునవ్వుల హరివిల్లుకు చిరునామా నా మిత్రులు
దివి నుండి భువికి జారవిడిచిన రవి కిరణాలు

కులమతాలకు అతీతులు నా మిత్రులు
ప్రేమ కరణులను జగమంతా పంచె వర పుత్రులు

ఈర్ష్య అసూయలను అరికట్టే నా మిత్రులు
జ్ఞ్యానతత్వం మానవత్వం జతకట్టే మహోన్నతలు

ధీరులు శూరులు విరాతివీరులు
నా మిత్రులు
వెరసి వీరందరూ దేవుడు చేసిన మనుషులు

నా మిత్రులతో నే గడిపిన క్షణాలు
నా జీవిత మదురపు జ్ఞ్యపకాలు

కవిత నా మిత్రులందరికీ అంకితం ...
- దాదా
============================================
30.
మన దాదా...

విశ్లేషణకు మించిన విశ్లేషకుడు
సందర్భానుసారంగా చలోక్తులు విసిరే చాకచక్యుడు
అత్యవసర సమయంలో తెలివిని ప్రదర్శించేటోడు
తను వెనకాలే ఉంటూ ముందుకు నడిపేటోడు
మౌనంగా ఉంటూనే మనసులను పసికట్టేటోడు

నటనలో నాగార్జున అంతటోడు
దాదాగిరిలో శంకర్ దాదా అంతటోడు
అమ్మాయిల విషయంలో నీటిలో ఉన్న ఎనుగులాంటోడు
ధందాలో నేల మీద ఉన్న మోసలిలాంటోడు

నీతోనే ఉన్నా అనే ఒక మెత్తని వంచకుడు
చాపకింద నీరులా తన పని తాను చేసుకునేటోడు
తెలంగాణ కోసం ఓటుని స్నేహం కోసం పర్సుని ఇచ్చేటోడు
అందరి హృదయాలను దోచుకున్నోడు
ఒక్కడు... మన దాదా గాడు
- . (కచ్చితంగా కవి)
- గని
============================================
29.
వాహ్వా ఎంతటి చాతుర్యం
వాహ్వా ఎంతటి చురుకుదనం
వాహ్వా ఎంతటి మాధుర్యం
వాహ్వా ఎంతటి గొప్పదనం

పులకరించెను నా వొళ్ళు
కదిలేను నా కళ్ళు
పగిలెను నా పళ్ళు
నీకు నిండు నూరేళ్ళు

ఎలాంటి ప్రాసలకైనా ప్రాణం పోసే ప్రా .పి.
నీకు నువ్వే పోటి నీకెవ్వరు రారు సాటి.

ఇది నా మిత్రుడు, తోటి కవి ప్రా.పి.(ప్రాస పిడుగు) కి అంకితం...
- . (కచ్చితంగా కవి)
- గని
============================================
28.
IISc లో తెలుగు వారి అభిమానమున్న
మన వాడు ఆహార్యం లో దున్న
వాడి మంచి మనసు ముందు పనికిరాదు రా వెన్న
నిద్రపోతే వాడు కుంభ కర్నుడికే అన్న

ఎవరికీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా గుర్తొస్తాడు వాడే చటుక్కున
అమ్మాయిల నాడిని పట్టాడు అవపోసన
కాని వాడి జుట్టు మీద పని చేయదు రా దువ్వెన
మనం tour కి వెళ్ళాలంటే ఉండాలి వాడే ప్రతి దిక్కున

మెస్ కమిటి లో పని చేసి ప్రజల ఆకలి తీర్చాలన్నా
తెలుగు సమితి లో ఆహ్లాదకర కార్య క్రమాలు పండాలన్నా
ప్లేస్మెంట్ లో సి. ఎస్. ను ఉద్యోగ సాధన లో ముందు ఉంచాలన్నా
H. P. గాడే మన పాలిటి తిరుమల వెంకన్న !!

- ప్రా . పి . (ప్రాస పిడుగు)
============================================
27.
వాడు సామాన్యుడు కాదు...

వాడు మనలో ఒకడు!! కాని మన వాడు కాదు...
వాడు ఆపదలో ఆదుకుంటాడు!! కాని మన బందువు కాదు...
వాడు మన గుండెల్లో వుంటాడు!! కాని మన మిత్రుడు కాదు...
వాడు మన పోరిని వాడుకుంటాడు!! కాని మన శత్రువు కాదు...
వాడు మాటలతో మాయ చేస్తాడు!! కాని మాయలోడు కాదు...
వాడు అన్నిటా మంచివాడు!! కాని చెడ్డవాడు కాదు...
వాడు కలియుగ కృష్ణుడు!! కాని దేవుడు కాదు...
వాడు పొట్టివాడు కాదు...
వాడు నల్లవాడు కాదు...
వాడు సామన్యుడు కాదు...

తవిక, నా కవి మిత్రుడు హెచ్.పి.లకు అంకితం....
-కక (కచ్చితంగా కవి ).
- గని
============================================
26.
భాయ్ మొదలు పెట్టాడు కవితలు
చాయ్ తాగాలిసిందే విని ఆ కవితలు
హాయ్ గా ప్రాజెక్ట్ చేయక ఏమిటీ కవితలు
భోర్ అన్నావంటే పట్టిస్తాడు నీకు చెమటలు

-- పెద్దన్న
============================================
25. (yeah.. silver jubilee)
అడుగు పెట్టాను ఏనుగు లా
కానీ ఇప్పుడు ఫీల్ అవుతున్నాను అరటి తొక్క లా
ఇక అడ్డు రానీ ఒక కొండ, అడ్డు రాని సముద్రం
ఇక వెను తిరిగేది లేదు.. ఇదే నా ధైర్యం

- భాయ్
============================================
24.
ప్రవహించాలి కవితల సాగరం
ఉప్పొంగాలి కెరటాలు
గుభాలించాలి సుమ గంధాలు
అభినందించాలి మా వాసు గాడి కవితలని

- పెద్దన్న
============================================
23.
అర్థం అయితే మాకు చెప్పండి...

నాకు తేలిక అడుతను ఎందుకు మీకు కవితలు భ్రమ ,
మీ కవితలు విని ,
యవరకైన పిచ్చిఎక్కల ఉంది మహిమ ,
మీ కవితలు విని ,
చనిపేయి వోడు పునర్జన్మం లో కూడా ఆత్మహత్య చేస్తానని ద్రిన సంకల్పాన

-వాసు
============================================
22.
కచ్చితంగా కవిని...
తరతరాలుగా నిదుర పోతున్న పులిని లేపితిరి...
మీ మధురమైన తవికలతో ఉక్కిరి బిక్కిరి చేసితిరి...
రాయిలా ఉండే నా గుండెని పువ్వూల మార్చితిరి...
నా లోని కవి హృదయం కదిలేలా కలతలు రేపితిరి...
తీవ్రమైన వేదనలతో......
భరించలేని బాధలతో......
మీ తవికలకి దాసుడైనా నేను... కచ్చితంగా కవిని...!!!

-కక(కచ్చితంగా కవి ).
============================================
21.

ఒక ప్రియుడు తన ప్రేయసి తో గొడవపడి ఇలా అన్నాడు దిక్కు తోచక ........
నాకు దొరికింది ఒక గర్ల్ ఫ్రెండ్ లేక లేక
చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నాం ఎంచక్కా
కానీ దానికి ఉంది తల తిక్క
దాంతో తిరిగితే నా జేబుకు బొక్క
ఇది, వాళ్ళ అయ్యాకి తెలిస్తే తీస్తాడు నా తొక్క, చించుతాడు నా డొక్కా

అయినా వోదిలించుకోలేక పోతున్నా..... ఇంకో గర్ల్ ఫ్రెండ్ దొరక్క

---సాయి
============================================
20.
నాకు కూడా పంపండి
కవితల బండి
మనుసుంటే చాలదండి
మెయిల్ అయిడీ ఆడ్ చేయండి !!!

- పేక
============================================
19.
సాగెను కవితలు ఎడతెగని ఏరులై
తీసేను మన వాళ్ళు కలములు వీరులై
ప్రయోగాలు కుసుమించేను సుందర విరులై
మనసును హత్తుకొనే మకరంద మరులై
నా ధాటి కి తట్టుకోలేక ఆగెదరా భీరులై
లేక చూపెదరా మీ యుక్తి ధీర శురులై

-
కేక
============================================
18.
enough of అంత్య ప్రాస..time for (పేరు తెలియదు) ఇంకో ప్రాస (target == Varma)
రక్ష రక్ష యని శరణు వేడినా దాక్షిణ్యము చూపక
పక్షులు, క్షీరదములు, సాగరాక్షువులను విచక్షణ లేక
రాక్షస వీక్షణముల తోడ వాటిని భక్షణ చేయు
కుక్షి పోషణా ధురన్ధరులకు శిక్షణ ఇచ్చి
ప్రక్షాళన చేసి మోక్షము పొందుటయే మనకి పరీక్ష ??! (మొత్తం 15 క్ష లు)
అర్ధాలు:
సాగరాక్షువులను= సముద్రానికి కళ్ళు = చేపలు, రొయ్యలు మొదలగునవి
కుక్షి = పొట్ట

-
ప్రా.పి.
============================================
17.
ఇది కవితా లోకానికే మలుపు
అందరికి ఇదే నా పిలుపు
రాయండి కవితలు వచ్చేటట్టు అలుపు
రెకెత్తిచండి కవితా జ్వాలలు
కవులకు ఇవే నా అభినoదనలు

- పెద్దన్న
============================================
16.
సాగుచుండ కవి సమరము సరసంగా
మిత్రజనావళి ని ప్రవర్ధమానముగా అలరింపంగా
ప్రతిసారి tivity అధికమై ప్రవహించంగా
మనలోని ఆశుకవితా కిరణాలు computer లోకి ప్రసరించంగా
Gmail కృష్ణ రాయల సభారాజము వలె భాసింపంగా
భావ సరస్వతే పని లేని మనని ఆవహించంగా
పైనున్న నన్నయ్య, తిక్కన్న లకే దిమ్మ తిరగంగా
రాయండి కవితలు ప్రజా రంజకంగా !!

-
ప్రా.పి.
============================================
15.
మళ్ళీ మొదలయింది తవికల గోల
ఇంకెన్ని నాళ్ళు సాగుతుందో కల కల
కదం తొక్కే తరుణం మరి ఉండదు మరో క్షణం
రాస్తనంటూ విజిలు వేయిస్తా నంటూ
రాయవేం ఏదయినా

తవిక తో చెప్తున్నా
నువ్వు కూడా రాయి సత్తి అన్నా !!

- పేక
============================================
14.
ఎవరితను...???
చిక్కుముడి నువ్వు విప్పు...
విప్పకపోతే అది నీ తప్పు...
నీ మొకంలో నా చెప్పు...
ఇపుడు అయిందా నీకు కనువిప్పు..

-కక (కచ్చితంగా కవి ).
============================================
13.
ఇది మా ప్రియ నేస్తం కళ్యాణ్ కి అంకితం

మావిచిగురు చూసి ఎడువండ్ ఎవడ్రా బచ్చా
తెలియదా నీకు తొక్కలో బోకు బిచ్చ
బాబు గారు గళం విప్పితే గొప్ప రచ్చ
కళ్యాణ్ గాడంటే మా అందరికి ఉచ్చ

- దాదా
============================================
12.
ఎం రో మాకు రావనుకున్నర
శురు చేసిన
ఆపండ్ర మీ లోలోని లొల్లిని
లేకపోతే తీస్తా నా లోనీ కలాన్నీ
వినలేక ముసుకుంటారు మీ చెవుల్ని
నాతో పెట్టుకుంటే మూసి నదిలో ముంచేస్తా మిమ్మల్ని

- అబ్బ ఛా
============================================
11.
ఇది చిన్నోడి కధ
మన వాసు గాడి వ్యధ

వాడికెందుకు శాపం
పదాలు దొరకవేం పాపం !!

-పేక
============================================
10.
నువ్వు కవి అంటే నేను ఒప్పుకోను...
నేను కవినని నీతో చెప్పను...
నీది కవిత్వమంటే నేను నమ్మను...
నాది కవిత్వమని నువ్వు నమ్మనపుడూ?... అసలు కవి ఎవరు??... ఎవరికీ ఉంది తవికలు రాసే శక్తి???...

- కక
============================================
9.
మౌనం నుండి జిమెయిల్ కి దిగివచ్చిన హరి
అయ్యాడు ఒక కవి
పంపాడు చూడచక్కని తవి
ఇది చదివి చితపట లాడదు అతని మైతు, చైతు
వీరి బాధతో ఆప్రసంతుడయ్యాడు మా ప్రశాంత్
చాలు ఆపండి అని ఆరిసాదు ఫని లేక, ఘని
ఇవన్ని చదవలేఖ అయ్యాను నేను రోజు శని.

- రెడ్డన్న
============================================
8.
ఎవరికీ వారే మిన్న
అనుకునే చిన్నా

ఒక్క కవిత్వాన్ని పొగిడే కన్నా
ప్రతి కవిత్వాన్ని ప్రేమించి సరదా పడు నాన్నా !!

-పేక
============================================
7.
ప్రసవించెను నాలోని కవి
ఉదయించెను ఇది విని రవి
అలరించెను పసి పాపల చెవి
పులకించెనా సడి లోన భువి
రచించెను గర్వంగా కవి
కరుణించి దీవించెను దివినున్న దేవి

భాష అంటే కాదు అక్షరాల మణిహారం
భాష అంటే మనసులు కలిపే ద్వారం

-దాదా
============================================
6.
నీ తరమా కవితా ప్రవాహాన్ని ఆపంగా
రాస్తా కవితలు ధారాళంగా
మనసులో భావాలు ఉప్పొంగంగా
నీకేం ప్రాబ్లం రా లంగా!!

-
ప్రా.పి.
============================================
5.
హెచ్.పి.లకు పట్టిన తవికల పిచ్చి...
చైతూలకు సోకింది అది వచ్చి...
చివరికి మేము చదివాలి చచ్చి...
దేవుడా మమల్ని రక్షించు తవికలను చదివే శక్తిని ఇచ్చి...!!!

-- కక
============================================
4.
ఆపండ్ర మీ కవితల దండ
మెచ్హితిని మీలోని హాస్యపు కొండ
విడిచితిని కవిత ఆగ లేకుండా
ఇకనైనా సెలవియ్యంద్ర మీ ముండ

-- దాదా
============================================
3.
దీనికి రిప్లై ఇస్తే పగులుద్ది నీ గుండు..
కనుక నోరు మూసుకు వుండు....
తినేసాక పారెయ్యాలి తొక్క అఫ్ పండు...
ఇది నా కవిత నెంబరు రెండు....

--
కేక
============================================
2.
నా పక్కనే నీవుండ
గా మనకెందుకీ రగడ
కవిత్వమా ఎండ
లో నీ మొహం మండ !!
-- ప్రా.పి.
============================================

1.

ప్రియ నేస్తమా ??
నా ముందు మౌనమా..??
లేక పోతే నీకేమైనా రోగమా...??
దిక్కులు చూడక ఇది వినుమా...??
ఎలా వుంది నిన్నటి సినిమా ???

-- కేక

Saturday, July 4, 2009

భాయ్

============================================
1. (yeah.. silver jubilee)
అడుగు పెట్టాను ఏనుగు లా
కానీ ఇప్పుడు ఫీల్ అవుతున్నాను అరటి తొక్క లా
ఇక అడ్డు రానీ ఒక కొండ, అడ్డు రాని సముద్రం
ఇక వెను తిరిగేది లేదు.. ఇదే నా ధైర్యం

- భాయ్
============================================

అబ్బ ఛా

============================================
2.
ఒక
ప్రియుడు తన ప్రేయసి తో గొడవపడి ఇలా అన్నాడు దిక్కు తోచక ........

నాకు దొరికింది ఒక గర్ల్ ఫ్రెండ్ లేక లేక
చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నాం ఎంచక్కా
కానీ దానికి ఉంది తల తిక్క
దాంతో తిరిగితే నా జేబుకు బొక్క
ఇది, వాళ్ళ అయ్యాకి తెలిస్తే తీస్తాడు నా తొక్క, చించుతాడు నా డొక్కా

అయినా వోదిలించుకోలేక పోతున్నా..... ఇంకో గర్ల్ ఫ్రెండ్ దొరక్క

---సాయి
============================================
1.
ఎం రో మాకు రావనుకున్నర
శురు చేసిన
ఆపండ్ర మీ లోలోని లొల్లిని
లేకపోతే తీస్తా నా లోనీ కలాన్నీ
వినలేక ముసుకుంటారు మీ చెవుల్ని
నాతో పెట్టుకుంటే మూసి నదిలో ముంచేస్తా మిమ్మల్ని

- అబ్బ ఛా
============================================

విర

============================================
4.
( ఎవరికి అంకితమో చెప్పక్కర లేదనుకుంటా....!!!!)

ఎంత వయసైనా వీడేప్పటికి సిటి బాయ్
మరిచిపోలేరేవ్వరు వీడు చెప్పే హాయ్

అంతర, జ్యోతి, అంజలి....
ఇంకెందరికో ఇచ్చాడు పుష్పాంజలి...

కాని ఇప్పటి వరకు కట్టలేదు ఎవరు జోడి
ఏముందని వీడి దగ్గర బోడి

గోళీలు రాలినట్లుందే వీడి నవ్వు
వింటే అదిరి బెదిరి పోతావు నువ్వు

తూర్పు పడమరలను ఒకేసారి చూసే వాడి కాళ్ళు
పట్టాలకు నీల్లోదిలెసిన రైళ్ళు

దెయ్యాలంటే వీడికి చచ్చేంత భయం
పగలు కూడా టార్చి లైటు అడగలేదింకా నయం

మీకు తెలుసా వీడికి సి ఎస్ అందగాడినని ఫీలిం'గని'
చందాలతో కొనిస్తాం, అద్దంలో ముఖం చూసుకోరా మై డియర్ గని

ఏది ఏమైనా మా వాడు కచ్చితంగా కవి
వాడి కవితలకు మేము కోసుకుంటాము చెవి

- కేక (
కే పెట్టించే వి ) మరియు విర (విప్లవ చయిత) అలియాస్ పెద్దన్న
============================================
3.
భాయ్ మొదలు పెట్టాడు కవితలు
చాయ్ తాగాలిసిందే విని ఆ కవితలు
హాయ్ గా ప్రాజెక్ట్ చేయక ఏమిటీ కవితలు
భోర్ అన్నావంటే పట్టిస్తాడు నీకు చెమటలు

-- పెద్దన్న

============================================
2.
ప్రవహించాలి కవితల సాగరం
ఉప్పొంగాలి కెరటాలు
గుభాలించాలి సుమ గంధాలు
అభినందించాలి మా వాసు గాడి కవితలని

- పెద్దన్న

============================================
1.
ఇది కవితా లోకానికే మలుపు
అందరికి ఇదే నా పిలుపు
రాయండి కవితలు వచ్చేటట్టు జలుబు
రెకెత్తిచండి కవితా జ్వాలలు
కవులకు ఇవే నా అభినoదనలు

- పెద్దన్న
============================================

రెడ్డన్న

============================================
3.
ఓ స్నేహమా గుర్తుందా! మన తియ్యటి పరిచయం,
అనురాగానికి అర్థం "నీవు", ఆప్యాయతలో పరమార్ధం "నీవు",
నా చిరునవ్వుకు ప్రేరణ "నీవు" , నా గుండె ప్రతి సవ్వడిలో "నీవు",
నా కలలకు జ్ఞాపకం "నీవు", కాలానికి ఆతీతం "నీవు",
నా జీవితానికి హరివిల్లువు "నీవు", స్నేహానికి చిహ్నం "నీవు",
నా ఆనందానికి కారణం "నీవు", ఈ కవితకి ప్రాణం "నీవు".
-- రెడ్డన్న

============================================
2.
గణేష్ హృదయ చకోరం వలచింది, ఒక వెన్నల హృదయాన్ని,
చిరువెన్నెల తనదే నని మురిసింది మై మరిచింది.
కాలమంతా వెన్నల కోసం పరుగులు తీసింది.
చివరకు అది అందలేదని, అందుకోలేనని,
ఒంటరిగ మిగిలింది, వేదనతో కుమిలింది, పాపం.
-రెడ్డన్న.
============================================
1.
మౌనం నుండి జిమెయిల్ కి దిగివచ్చిన హరి
అయ్యాడు ఒక కవి
పంపాడు చూడచక్కని తవి
ఇది చదివి చితపట లాడదు అతని మైతు, చైతు
వీరి బాధతో ఆప్రసంతుడయ్యాడు మా ప్రశాంత్
చాలు ఆపండి అని ఆరిసాదు ఫని లేక, ఘని
ఇవన్ని చదవలేఖ అయ్యాను నేను రోజు శని.

- రెడ్డన్న
============================================

పేరులేని కవి

============================================
10. అందరికి ప్రీతీ పాత్రుడైన హరికి జన్మదిన శుభాకాంక్షలతో .. ఈ చిన్ని కవిత

సాగించు ఈ మార్గదర్శి జీవితంలో నీ ప్రయాణం
తరగకుండా ఎటువంటి ప్రమాణం

నీ అండ ఉంటె మాకు లేదు ఎటువంటి ప్రమాదం [:P]
నువ్వు చీకటి గుండెల్లో వెలుగునిచ్చే ప్రమిదం
నీతో గడిపిన iisc లైఫ్ అందరికి ప్రమోదం
నీ వ్యక్తిత్వానికి కావాలి సిసలయిన ప్రబోధం
నీ కవిత్వం అవ్వాలి ప్రబంధం
నీ మీద ఎవ్వరకు కలుగదు ప్రతిశోదం
నువ్వు మా అందరికి ఆ "హరి ప్రసాదం" !!

-- పేక
============================================
9.
తెలుగు వీరా నిదుర లే!!!

తల్లి తండ్రులు ఆనంద భాష్పాలు రాల్చేలా
తోటి మిత్రులు గర్వపడేలా
శత్రువులు తల్లడిల్లెలా
ప్రపంచం దద్దరిల్లేలా

ప్రపంచాన్ని సుడిగాలి వేగం తో ఎదురుకుందాం
ప్రపంచ చరితనే తిరగరాద్దాం

తెలుగోడి పొగరు ఇదే
తిరిగిచూడకు నీ మార్గమిదే!!

నే తలచుకుంటే కానిదేది లేదని
అష్టైశ్వర్యాలు , ఘనులు నీ వాకిట రావాలి అని
నీ కధ నలుగురు చెప్పుకోవాలి
నీ ఒక్క మాట మీద చర్చలు జరగాలి

నలుగురికి విశ్వాసం పంచేలా
నలుగురికి స్పూర్తినిచ్చేలా
నలుగురికి చేతనయిన సాయం చేసేలా
నలుగిరి కోసం బ్రతికి పురుషార్ధం పొందు ధీరుడిలా , వీర పురుషుడిలా

నే మాటలకు అంకితం కాదంటూ
నే చేసిన పని సామాన్యం కాదంటూ
కావాలి ప్రపంచానికి కనువిప్పు
మాటలతో కాదు కేవలం చేతలతో చెప్పు

నీ మాతృభూమి కాదా నీ కన్నా తల్లితో సమానం
నీ తపన నరాల్లోకి ఇంకి పోవాలి నీ తల్లి కోసం
కావాలి నీ ప్రయత్నం నూరు శాతం
ఇంకెంత తక్కువైనా ఆ నేరం విపరీతం

ఇది ధర్మ యుద్ధం, ప్రతి రోజు కావాలి పోరాటం
లక్ష్య సాధనే నీ కర్తవ్యం
ప్రతి ఒక్కరికి చెప్పిపో నీ సందేశం

ఆరంభమిది అంతం కాదు
అని గ్రహించి .... ఓ తెలుగు వీరా
నువ్వు నిదుర లేరా!!!

- పేక

============================================
8. ఈ కవిత ఒకరి జన్మదిన కానుక ..
కాని దానికి తగిన పేరు రాలేదు ..
కనీసం మన blog లోకి అయిన పనికి వస్తుందని ఆశిస్తున్నాను.

చిరునవ్వుతో పలుకుతుంది ఆహ్వానం
మెండుగా ఉంది తనలో ఆత్మాభిమానం
నలుగురికి సహాయం చేసే గుణం
దాన ధర్మములకు సంఖోచించదు క్షణం
మిత్రులకు తోడ్పడే స్వభావం
మా అందరిపై ఉంటుంది తన ప్రభావం

అందం చందం, తెలివి చదువు
అరుదైన వనితకు ఇవన్నియును కలవు
తన విచక్షణకు లేదు సెలవు
కల్ల నిజములు కనిపెట్టుట తనకెంతో సులువు

తన శైలి వేరు
తన మనసుకి దారి వేరు
తన మాటలు ప్రవహించే సెలయేరు
తన చూపులకు జనులు ముగ్దులయ్యేరు

కోపం వస్తే హరి హరి
అవుతుంది మన పని సరాసరి

తన మార్గము స్ఫూర్తినిచ్చు
అది కన్న ఎవ్వరైన మెచ్చు

నీ పరిచయం పంచెను ఆనందపు జల్లులు
విరిశాయి మనసంతా రంగుల హరివిల్లులు
అధిగమించగలవు ఎట్టివైనా కాలం పెట్టిన పరీక్షలు
అని ఆసిస్తూ , నీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు

-- పేక

============================================

7.
ఈ కవిత వీర శూర కర్ణుడికి అంకితం

వినర వినర ఓ వీర పురుషుడి
కధ
అడుగడుగునా శాప గ్రస్తుడైన ఓ క్షత్రియుడి
వ్యధ

లోకం కనీ విని ఎరుగని దాన వీరుడు
ఇంద్రుడికి సైతం దాన మిచ్చిన దయార్ధ హృదయుడు

రాధేయుడిగా పరిచయమై, సూద్రుని పుత్రుడుగా వ్యాప్తమై
అవమానం భరించెను , కీర్తికై తన మనస్సు తపించెను

పరశురాముడి శిష్యుడు , ఈతండు ధనుర్విద్యలో సర్వశ్రేష్టుడు
ఇతడు సంధించిన శరం కడు వేగం,
అర్జునునికి లేదు వాటికి సమాధానం

అంగ రాజ్యానికి నరేశుడై సుయోధనుడికి రుణబద్ధుడు ,
అధర్మ పక్షాన ధర్మయుద్ధంలో పరాజితుడైన శాపగ్రస్తుడు

అర్జునుడు చేసెను కపటము , ఇతను పలికెను వీరస్వర్గమునకు స్వీకారము
రణరంగంలో ఓ మహావీరుడు నేలకూలేను , అది చూచి
ముల్లోకాలు తల్లడిల్లెను

ఆతండి స్నేహభావం కావాలి మనకి ఆదర్శం
విషపూరితమైన నేటి సమాజంలో కర్ణ నామమే మన నినాదం

-- పేక (పేరు లేని కవి)
============================================
6.
ఇది నా ప్రియ మిత్రుడు సాయి కి అంకితం

ముఖ కవళికల్లో పసి పాపాయి
వాడికి శృతి అంటే హాయి

వినండి వాడి పసి పలుకులు
రుజువు ఇదే వాడి "ఎం జేస్తుల్లు " !!!

- పేక
============================================
5.
ధీరులు శూరులు అవ్వుదురో కాదో
తేనె పలుకులు ఉన్నవో లేవో

భలే ఉంది మన దాదా 'మిత్రులు'
ఇదే మీకు నా రామ నవమి శుభాకాంక్షలు !!
- పేక
============================================
4.
నాకు కూడా పంపండి
కవితల బండి
మనుసుంటే చాలదండి
మెయిల్ అయిడీ ఆడ్ చేయండి !!!

- పేక
============================================
3.
మళ్ళీ మొదలయింది తవికల గోల
ఇంకెన్ని నాళ్ళు సాగుతుందో కల కల
కదం తొక్కే తరుణం మరి ఉండదు మరో క్షణం
రాస్తనంటూ విజిలు వేయిస్తా నంటూ
రాయవేం ఏదయినా

తవిక తో చెప్తున్నా
నువ్వు కూడా రాయి సత్తి అన్నా !!

- పేక
============================================
2.
ఇది చిన్నోడి కధ
మన వాసు గాడి వ్యధ

వాడికెందుకు శాపం
పదాలు దొరకవేం పాపం !!

- పేక
============================================
1.
ఎవరికీ వారే మిన్న
అనుకునే చిన్నా

ఒక్క కవిత్వాన్ని పొగిడే కన్నా
ప్రతి కవిత్వాన్ని ప్రేమించి సరదా పడు నాన్నా !!

- పేక
============================================

ప్రాపి

============================================

11. ప్రియమిత్రుడు హరి కి జన్మదిన శుభాకాంక్షలతో

స్వరఝరిన ఓలలాడె నీ గాన లహరీ లాహిరి
మిత్ర హృదయ మంజరియై సాగాలి నీ కచేరి
సొగసరి అయినా కాకున్నా పోరిని వదలని ఓ పోకిరీ !
మహనీయుల మార్గమ్మున సాగించు నీ సవారి
గాంధీ నెహ్రూ ల సరసన నిలావాలి నీవు చేరి
నీ జయంతి పసిడిగా చరిత లోన కొలువుదీరి
ఇవ్వాలి మాకు సెలవు విధి తప్పక ప్రతిసారి
ఎంత ఎత్తుకు ఎదిగినా birthday party మరువవు మరి
ఎందుకంటే u are basically Hari!!

- ప్రాస పిడుగు (ప్రాపి)
============================================
10.
మళ్ళీ 11 'అభి' లు... బావ గారికి అంకితం

అభి అంటే అభిప్రాయం - ప్రతి విషయం మీదా కచ్చితమైన అభిప్రాయం
అభి అంటే అభిరుచి - bleach పట్ల అభిరుచి
అభి అంటే అభిమానం - "short" వేసుకోవడం అన్నా short వాళ్ళు (ఇందుర్తి సతీష్ రెడ్డి) అన్నా అభిమానం
అభి అంటే అభ్యర్ధన - వాడిచ్చే పాటలు, సినిమాలూ చూడమని అభ్యర్ధన
అభి అంటే అభిమన్యుడు - హరిత్సా పన్నిన పద్మవ్యూహాం పికాసో లో నించి బయటపడలేని అభిమన్యుడు
అభి అంటే అభ్యాగతుడు - రోజుకో కొ(చె)త్త రెస్టారెంట్ లో అభ్యాగతుడు (చెప్పకుండా వచ్చే అతిథి)
అభి అంటే అభివందనం - 'పూ' అనే పడం తోనే చేస్తాడు అందరికీ అభివందనం
అభి అంటే అభినందన - అనూషిక అందానికి అభినందన
అభి అంటే అభివృద్ధి - badminton లో అనతి కాలంలోనే గురువుని మించేంత అభివృద్ధి
అభి అంటే అభ్యాసం - ఎంతటి కష్టమైన subjects అయినా చేయగల అభ్యాసం
అభి అంటే అభ్యుదయం - AOE, Chess లలో (వీడి ప్రవేశం) దేశానికే అభ్యుదయం

అభి అంటే అభిరామ - మేమందరం అభిమానించే ఒక దున్నపోతు ...

- ప్రాపి (ప్రాస పికాసో)
============================================
9.
ఒక విప్లవ కవిత ..... సాధించు తెలుగోడా

చేతకాని చవట లాగా పని చేయక కూర్చుంటే
వృధా కాద stipend కూర్చొని తింటే
నూరు కోట్ల ప్రజలందరి ఆశలన్ని మనవేంటే
భరతమాత ఋణం తీర్చు మార్గమింక కష్టమొకటే!!

తీరుబడిగా సాగిలపడు సమయమింక లేదు మనకు
ఇప్పుడంటు అప్పుడంటు జాగు చేస్తే వృధా బ్రతుకు
తప్పు నాది కాదు అనకు, నాకు చేత కాదు అనకు
వనరులిక్కడ లేవు అనకు, నడుం కట్టి ముందుకురుకు
తిరుగులేని (100 ఏళ్ళ) చరిత నుండి, ఎదురులేని భవిత వరకు
అలుపులేక ముందుకేగు, తరిగిపోని ప్రగతి కొరకు!!

కలలు కను నిర్భయంగా
ప్రయత్నించు నిర్విరామంగా
నమ్మకముంచు గర్వంగా
శ్రమించు ఇష్టంగా
తడబడు తాత్కాలికంగా
నవ్వులపాలవ్వు దయనీయంగా

అయినా చివరికి సాధించు చారిత్రాత్మకంగా !!

- వస పిట్ట లా వాగే మీ ప్రాస పిట్ట (ప్రాపి)
============================================
8.
ఇది కవిత కాదు ...a sequel

చంచల హిరణి వోలె చెంగున చేదరిపోబోతున్న అందమైన కలను
కనురెప్పల (సాలీడు)వల వేసి నిద్రమత్తు దారము తోడను
పునఃనిర్మించ యత్నించు నాపై ఆ ప్రత్యక్ష దైవము జ్ఞాన తిమిరాల ప్రసరించి
మాయలేడిని సంహరించిన రామబాణము వోలె (ఆ కలపై)నా మమకారాంధకారమును హరించి
"కర్తవ్యమ్ దైవమాన్హికం" అనుచు మోక్ష సోపాన మార్గము చూపె !!

అర్ధాలు:
----------
సోపానము = మెట్టు
హిరణి = లేడి = జింక
ప్రత్యక్ష దైవము = కనిపించే ఏకైక దేవుడు = సూర్యుడు
- ప్రాపి (ప్రాస పిపాసి)
============================================
7.
ఇది కవిత కాదు ...(
భయ పడవద్దు కింద అర్ధాలు భావం ఉన్నాయి)

నిశీధరయైన ఆకాశ వనిత తన చుక్కల దుప్పటిని తొలగించ

ప్రభాత భానుడు తన నుదుటి తిలకము నలంకరించగా నేతెంచ

అపురూప సౌందర్యవతియైన లలనామణి లజ్జావహిత దరహసమువలె ప్రవర్ధమానముగ

నా (కిటికీ యొక్క) ద్వారబంధమును తన దర్శనోద్దిపిక యై ప్రకశింపజేయుచు

స్వప్న ద్వార పాలకులైన నా కనురెప్ప లను కవ్వించెడి కిరణశరములు సంధించి శుభోదయమ్మును పలికె !!

భావము:
-------------
నిశీధర (= చీకటి ని వేసుకున్న/ ధరించిన ) ఆకాశం చుక్కల తో చేసిన తన దుప్పటి ని తొలగిస్తున్నప్పుడు చూసిన సూర్యుడు తనకి నుదుట బొట్టు అలంకరించడానికి మెల్లగా వస్తూ, ఒక అందమైన అమ్మాయి నవ్వితే విధంగా అయితే తన పెదవులు increasingly విచ్చుకుంటాయో, అంతే మెల్లగా నా room కిటికీ కున్న (గాజు)తలుపును తన దర్శనోద్దిపిక(దర్శన + ఉద్దిపిక = దర్శనాన్ని కలిగించే అద్దము ) లాగ ప్రకశింపజేస్తూ నా కలలకు (నేను నిద్ర పోతున్నాను కదా) ద్వార పాలకులైన కను రెప్పలకు కితకితలు పెట్టే కిరణాలనే బాణాలను (కిరణశరములు) వేసి (అంతే నిద్ర లేపి) శుభోదయమ్మును పలికె(good morning చెప్పాడు) ... అదన్నమాట పిశాచి బాధ !!
- ప్రా . పి (ప్రాస పిశాచి)
============================================
6.
వీడు నవ్వితే బొంత కాకి
అంజలి లేదు కనక ఏకాకి
పడతాడో లేదో ఇంకొక పోరిని వెతికి
వీడుంటే చుట్టుపాక్కలంతా చలాకి
పంచ్ బాంబుల తో ఎప్పుడూ మనం perfect కాదని తెస్తాడు గుర్తుకి
కవితా బాంబు లతో చేసాడు సి. ఎస్. ని నాగసాకి
అల్ ది బెస్ట్ రా కన్నా నీ లైఫ్ కి
- ప్రా . పి . (ప్రాస పిచ్చోడు)
============================================
5.
IISc లో తెలుగు వారి అభిమానమున్న
మన వాడు ఆహార్యం లో దున్న
వాడి మంచి మనసు ముందు పనికిరాదు రా వెన్న
నిద్రపోతే వాడు కుంభ కర్నుడికే అన్న

ఎవరికీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా గుర్తొస్తాడు వాడే చటుక్కున
అమ్మాయిల నాడిని పట్టాడు అవపోసన
కాని వాడి జుట్టు మీద పని చేయదు రా దువ్వెన
మనం tour కి వెళ్ళాలంటే ఉండాలి వాడే ప్రతి దిక్కున

మెస్ కమిటి లో పని చేసి ప్రజల ఆకలి తీర్చాలన్నా
తెలుగు సమితి లో ఆహ్లాదకర కార్య క్రమాలు పండాలన్నా
ప్లేస్మెంట్ లో సి. ఎస్. ను ఉద్యోగ సాధన లో ముందు ఉంచాలన్నా
H. P. గాడే మన పాలిటి తిరుమల వెంకన్న !!

- ప్రా . పి . (ప్రాస పిడుగు)
============================================
4.
enough of అంత్య ప్రాస..time for (పేరు తెలియదు) ఇంకో ప్రాస (target == Varma)
రక్ష రక్ష యని శరణు వేడినా దాక్షిణ్యము చూపక
పక్షులు, క్షీరదములు, సాగరాక్షువులను విచక్షణ లేక
రాక్షస వీక్షణముల తోడ వాటిని భక్షణ చేయు
కుక్షి పోషణా ధురన్ధరులకు శిక్షణ ఇచ్చి
ప్రక్షాళన చేసి మోక్షము పొందుటయే మనకి పరీక్ష ??! (మొత్తం 15 క్ష లు)
అర్ధాలు:
సాగరాక్షువులను= సముద్రానికి కళ్ళు = చేపలు, రొయ్యలు మొదలగునవి
కుక్షి = పొట్ట

- చైతు
============================================
3.
సాగుచుండ కవి సమరము సరసంగా
మిత్రజనావళి ని ప్రవర్ధమానముగా అలరింపంగా
ప్రతిసారి tivity అధికమై ప్రవహించంగా
మనలోని ఆశుకవితా కిరణాలు కంప్యూటర్లోకి ప్రసరించంగా
బ్లాగర్ ఏ కృష్ణ రాయల సభారాజము వలె భాసింపంగా
భావ సరస్వతే పని లేని మనని ఆవహించంగా
పైనున్న నన్నయ్య, తిక్కన్న లకే దిమ్మ తిరగంగా
రాయండి కవితలు ప్రజా రంజకంగా !!

-చైతు

-- చైతు