Friday, July 3, 2009

కచ్చితంగా కవి

============================================

10. కచితంగా కవి అందించిన ఆణిముత్యం

దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు... కామెడి కోసం ఇలా రాసనంతే. -కచ్చితంగా కవి.

1. "యంగ్ స్టార్" సత్తి నటించిన తొలి చిత్రం "చంటి పిల్లాడు (success story of a kid)" బాక్సపిసు వద్ద మంచి హిట్ అయింది. దానితో మన యంగ్ స్టార్ రెట్టించిన ఉత్సాహంతో నటించిన రెండవ చిత్రం "ఆంద్ర కుర్రాడు... ఒరిస్సా ఆంటీ" విడుదలకు సిద్దంగా వుంది.

2. "డేరింగ్ స్టార్" దాదా చాల విరామం తర్వాత నటిస్తున్న భారి బడ్జెట్ మూవీ "నన్ను నమ్ముకో... ఉన్నది అమ్ముకో... " కి బడ్జెట్ సరిపోకపోవడంతో అర్థాంతరంగా ఆగిపోయిన సినిమా షూటింగ్.

3. "బోల్డ్ స్టార్" బాబాయ్ నటించిన మూడవ చిత్రం "పాప దొరికింది... పర్స్ పోయింది" తన కెరీర్ లో పెద్ద హిట్ అని తెలుసు. ఈ సినిమాకి సిక్వెల్ గా వస్తున్న చిత్రం పేరు "పర్స్ తో పనేంటి" అని కరారు చేసారు.

4. "ఆంధ్ర కృష్ణుడు" హరి నటించిన రొమాంటిక్ మూవీ "చెద్దరు తెచ్చిన ముప్పు"కి ఇంకా ధియేటర్ల దగ్గర రద్దీ తగ్గలేదు. దర్శకుడు దోస జగన్నాథ్ తో మరో action thriller మూవీ "పెళ్లి నీది... కాపురం నాది " కి ముహూర్తం కరారైంది.

5. స్టోరీల ఎంపిక విషయంలో ఎప్పుడూ confuse అయ్యే మన confusion star అర్షద్ భాయ్ ఫిక్షన్ మూవీ "అంతులేని ఆలోచన (infinite thinking)" విడుదల తేది ఇంకా కరారు కాలేదు.

6. "వెరైటి హీరో" వర్మ నటించిన "కిచెన్ లో కాపురం పెడతా" అంతగా ప్రేక్షకుల మెప్పు పొందలేదు. తను రాసుకున్న కథకు దర్శకులు ముందుకురాకపోవడంతో, తన స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం "నేను తిన్న బొచ్చు బిర్యాని కథ" నిన్న రామోజీ ఫిలిం సిటీలో లాంచనంగా షూటింగ్ ప్రారంభమైంది.అల్ టైం హీరో చైతు మొదటి క్లాప్ ఇచ్చారు. ఈ చిత్రానికి నిర్మాత మన బోల్డ్ స్టార్ బాబాయి కావటం విశేషం.

7. "Expressions king" prince కల్లు నటించిన "కల్తిలేని కొత్త ప్రేమ" ఫ్లాప్ కావటంతో తన తదుపరి చిత్రం "B" మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సినిమా షూటింగ్ పూర్తి అయింది, వచ్చేనెల మొదటి వారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కోసం కల్లు సంప్రదాయక నృత్యాలతో పాటు హిప్ హాప్, సల్సా, టాంగో,బ్రేక్ డాన్స్ , జిగ్గింగ్, బాల్లెట్ వంటి అన్ని రకాల వెస్ట్రన్ డాన్స్ ఎంతో కష్టపడి నేర్చుకున్నారు.

8. "ఆల్ టైం హీరో" చైతు నటించిన "ఎంత సేపైనా తింటా " సినిమా స్టొరీలైన్ క్లిష్టంగా ఉండడంతో మళ్ళి ధియేటర్ కి వస్తున్న జనాలు.

9. "ఫ్యామిలీ స్టార్" సత్తి పండు నటించిన కొత్త చిత్రం "నేను బడికి పోతా!" డబ్బింగ్ పూర్తి కావస్తుంది.

10. సరదాగా సాగిపోయే కథాంశంతో నిర్మించిన చిత్రం "నువ్వు...నేను... కప్ ఐస్ క్రీం!" రెడి ఫర్ రిలీస్.

11. "ఆ అమ్మాయి నన్నే చూస్తుంది", "అందాల అబ్బాయి... వేధించే అమ్మాయిలు" వంటి చిత్రాల ద్వార "లవర్ బాయ్" గా పేరు తెచుకున్న "బాల భాయ్" తన మాస్ ఇమేజ్ పెంచుకోటానికి ప్రయత్నిస్తున్న చిత్రం "తోడ మీద ఒట్టు... తోలు తీస్తా" రేపే షూటింగ్ ప్రారంభం.

12. "ఏయ్... ఒరేయ్... నాది కూడా చూడండిరా." సినిమా ఆడియో నిన్న తాజ్ హోటల్ లో రిలీస్ అయ్యింది.

కొంచం ఉప్పు , కారం

తాజా వార్త.. ఫ్యామిలీ స్టార్ సతీష్ గారి సినిమా పేరు "నేను ISB కి పోతా" అని మార్చడమైనది

"బోల్డు స్టార్ " బాబాయ్ సిని చరిత్ర లో మలుపు కావనున్న సినిమా "మహానగరం లో ఒంటరి" , త్వరలో విడుదలకు సిద్ధం కానుంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక బాబాయ్ పర్సు కి పని పడుతుందని ప్రేక్షకుల అభిప్రాయం...

============================================
9.
అవసరం ఏంటి ???

నీ పాపములను తొలగించేదను... నేను పాపములు చేయలేదు.
నిన్ను కష్టములనుంచి రక్షించేదను... నేను కష్టాలలో లేను.
నీకు సహాయము చేసెదను... నేను నా పని చేసుకోగలను.
నీకు శాంతిని కలిగించేదను... నేను ప్రశాంతగానే ఉన్నాను.

నేను విన్న ఒక చిన్న కథ:
ఒక దయహృదయుడు, కరుణామయుడు సహాయము చేయాలనే మంచి మనసు కలవాడు ఒక రోజు తన చుట్టూతాను గూడు కట్టుకుంటున్న ఒక పట్టు పురుగుని చూసాడు. అది చూసినా అతను పట్టు పురుగు ఎందులోనోచిక్కుకుంటున్నదని భావించి గూడుని తొలగించాడు. ప్రకృతి విరుద్దంగా జరిగిన చర్య వలన పట్టుపురుగుచనిపోయినది. అతను చేయదలుచుకున్న సహాయం ఉపయోగపడకపోగా పట్టుపురుగు ప్రాణాలను బలితీసింది.

నీతి: బలవంతంగా, అడగకపోయినా సహాయం చేయడం మంచిది కాదు. మనం చూపించే అధిక ప్రేమ వేరేవాళ్ళ అబివృద్దికి అడ్డం కావచ్చు.


-కక(కచ్చితంగా కవి).
============================================
8.
మరిచిపో... మరిచిపోకు...

నీ బలహీనతను మరిచిపో ! నీ బలాన్ని మరిచిపోకు !!
నిజంకాని కలలను మరిచిపో ! కలలు కనటం మరిచిపోకు !!
స్టార్టప్ ఫెయిల్ అయితే మరిచిపో ! ఇంకో స్టార్టప్ పెట్టాలనేది మరిచిపోకు !!
జీవితంలో ఫెయిల్ అయితే మర్చిపో ! మిగిలిన జీవితాన్ని మరిచిపోకు!!

నీకు జరిగిన మోసం మరిచిపో ! నువ్వు చేసిన మోసం మరిచిపోకు !!
మిత్రుడు చేసిన ద్రోహం మరిచిపో ! అతను పంచిన ప్రేమను మరిచిపోకు !!
ఒకరి ప్రేమలో ఫెయిల్ అయితే మరిచిపో ! ఇంకోక్కరిని ప్రేమించాలని మరిచిపోకు !!

ఓటమిని మరిచిపో ! గెలవాలని మరిచిపోకు !!
చెడుని మరిచిపో ! మంచిని మరిచిపోకు !!
ద్వేషించడం మరిచిపో ! ప్రేమించడం మరిచిపోకు !!
అన్ని మరిచిపో ! నిన్ను నువ్వు మరిచిపోకు !!

-కక(కచ్చితంగా కవి).
============================================
7.
మన దాదా...

విశ్లేషణకు మించిన విశ్లేషకుడు
సందర్భానుసారంగా చలోక్తులు విసిరే చాకచక్యుడు
అత్యవసర సమయంలో తెలివిని ప్రదర్శించేటోడు
తను వెనకాలే ఉంటూ ముందుకు నడిపేటోడు
మౌనంగా ఉంటూనే మనసులను పసికట్టేటోడు

నటనలో నాగార్జున అంతటోడు
దాదాగిరిలో శంకర్ దాదా అంతటోడు
అమ్మాయిల విషయంలో నీటిలో ఉన్న ఎనుగులాంటోడు
ధందాలో నేల మీద ఉన్న మోసలిలాంటోడు

నీతోనే ఉన్నా అనే ఒక మెత్తని వంచకుడు
చాపకింద నీరులా తన పని తాను చేసుకునేటోడు
తెలంగాణ కోసం ఓటుని స్నేహం కోసం పర్సుని ఇచ్చేటోడు
అందరి హృదయాలను దోచుకున్నోడు
ఒక్కడు... మన దాదా గాడు
- . (కచ్చితంగా కవి)
- గని
============================================

6.
వాహ్వా
ఎంతటి చాతుర్యం
వాహ్వా ఎంతటి చురుకుదనం
వాహ్వా ఎంతటి మాధుర్యం
వాహ్వా ఎంతటి గొప్పదనం

పులకరించెను నా వొళ్ళు
కదిలేను నా కళ్ళు
పగిలెను నా పళ్ళు
నీకు నిండు నూరేళ్ళు

ఎలాంటి ప్రాసలకైనా ప్రాణం పోసే ప్రా .పి.
నీకు నువ్వే పోటి నీకెవ్వరు రారు సాటి.

ఇది నా మిత్రుడు, తోటి కవి ప్రా.పి.(ప్రాస పిడుగు) కి అంకితం...
- . (కచ్చితంగా కవి)
- గని
===============================================

5.
వాడు సామాన్యుడు కాదు...

వాడు మనలో ఒకడు!! కాని మన వాడు కాదు...
వాడు ఆపదలో ఆదుకుంటాడు!! కాని మన బందువు కాదు...
వాడు మన గుండెల్లో వుంటాడు!! కాని మన మిత్రుడు కాదు...
వాడు మన పోరిని వాడుకుంటాడు!! కాని మన శత్రువు కాదు...
వాడు మాటలతో మాయ చేస్తాడు!! కాని మాయలోడు కాదు...
వాడు అన్నిటా మంచివాడు!! కాని చెడ్డవాడు కాదు...
వాడు కలియుగ కృష్ణుడు!! కాని దేవుడు కాదు...
వాడు పొట్టివాడు కాదు...
వాడు నల్లవాడు కాదు...
వాడు సామన్యుడు కాదు...


తవిక, నా కవి మిత్రుడు హెచ్.పి.లకు అంకితం....
-కక (కచ్చితంగా కవి ).
- గని


============================================
4.
కచ్చితంగా కవిని...
తరతరాలుగా నిదుర పోతున్న పులిని లేపితిరి...
మీ మధురమైన తవికలతో ఉక్కిరి బిక్కిరి చేసితిరి...
రాయిలా ఉండే నా గుండెని పువ్వూల మార్చితిరి...
నా లోని కవి హృదయం కదిలేలా కలతలు రేపితిరి...
తీవ్రమైన వేదనలతో......
భరించలేని బాధలతో......
మీ తవికలకి దాసుడైనా నేను... కచ్చితంగా కవిని...!!!

-కక(కచ్చితంగా కవి ).

============================================
3.
ఎవరితను...???
చిక్కుముడి నువ్వు విప్పు...
విప్పకపోతే అది నీ తప్పు...
నీ మొకంలో నా చెప్పు...
ఇపుడు అయిందా నీకు కనువిప్పు..

-కక (కచ్చితంగా కవి ).
============================================
2.
నువ్వు కవి అంటే నేను ఒప్పుకోను
నేను కవినని నీతో చెప్పను
నీది కవిత్వమంటే నేను నమ్మను
నాది కవిత్వమని నువ్వు నమ్మనపుడూ, అసలు కవి ఎవరు?

- కక
============================================
1.
హెచ్
.పి.లకు పట్టిన తవికల పిచ్చి...
చైతూలకు సోకింది అది వచ్చి...
చివరికి మేము చదివాలి చచ్చి...
దేవుడా మమల్ని రక్షించు తవికలను చదివే శక్తిని ఇచ్చి...!!!

-- కక

3 comments:

  1. evarandi meeru kavi kaadu ani annadi.....
    meeru kavi kaadu anna vaadini kaalethi kodatha...ledantey kathi tho podustha....

    ReplyDelete
  2. inko chinna pogadtha andi....meeru emi anukovaddu....antey meeku pogadthalu nachavanta........mee kalam peru keka !!

    ReplyDelete
  3. nenu kachitanga kavini !!! LOL !!! KaKa u rock man!!!!

    ReplyDelete