Saturday, July 4, 2009

పేరులేని కవి

============================================
10. అందరికి ప్రీతీ పాత్రుడైన హరికి జన్మదిన శుభాకాంక్షలతో .. ఈ చిన్ని కవిత

సాగించు ఈ మార్గదర్శి జీవితంలో నీ ప్రయాణం
తరగకుండా ఎటువంటి ప్రమాణం

నీ అండ ఉంటె మాకు లేదు ఎటువంటి ప్రమాదం [:P]
నువ్వు చీకటి గుండెల్లో వెలుగునిచ్చే ప్రమిదం
నీతో గడిపిన iisc లైఫ్ అందరికి ప్రమోదం
నీ వ్యక్తిత్వానికి కావాలి సిసలయిన ప్రబోధం
నీ కవిత్వం అవ్వాలి ప్రబంధం
నీ మీద ఎవ్వరకు కలుగదు ప్రతిశోదం
నువ్వు మా అందరికి ఆ "హరి ప్రసాదం" !!

-- పేక
============================================
9.
తెలుగు వీరా నిదుర లే!!!

తల్లి తండ్రులు ఆనంద భాష్పాలు రాల్చేలా
తోటి మిత్రులు గర్వపడేలా
శత్రువులు తల్లడిల్లెలా
ప్రపంచం దద్దరిల్లేలా

ప్రపంచాన్ని సుడిగాలి వేగం తో ఎదురుకుందాం
ప్రపంచ చరితనే తిరగరాద్దాం

తెలుగోడి పొగరు ఇదే
తిరిగిచూడకు నీ మార్గమిదే!!

నే తలచుకుంటే కానిదేది లేదని
అష్టైశ్వర్యాలు , ఘనులు నీ వాకిట రావాలి అని
నీ కధ నలుగురు చెప్పుకోవాలి
నీ ఒక్క మాట మీద చర్చలు జరగాలి

నలుగురికి విశ్వాసం పంచేలా
నలుగురికి స్పూర్తినిచ్చేలా
నలుగురికి చేతనయిన సాయం చేసేలా
నలుగిరి కోసం బ్రతికి పురుషార్ధం పొందు ధీరుడిలా , వీర పురుషుడిలా

నే మాటలకు అంకితం కాదంటూ
నే చేసిన పని సామాన్యం కాదంటూ
కావాలి ప్రపంచానికి కనువిప్పు
మాటలతో కాదు కేవలం చేతలతో చెప్పు

నీ మాతృభూమి కాదా నీ కన్నా తల్లితో సమానం
నీ తపన నరాల్లోకి ఇంకి పోవాలి నీ తల్లి కోసం
కావాలి నీ ప్రయత్నం నూరు శాతం
ఇంకెంత తక్కువైనా ఆ నేరం విపరీతం

ఇది ధర్మ యుద్ధం, ప్రతి రోజు కావాలి పోరాటం
లక్ష్య సాధనే నీ కర్తవ్యం
ప్రతి ఒక్కరికి చెప్పిపో నీ సందేశం

ఆరంభమిది అంతం కాదు
అని గ్రహించి .... ఓ తెలుగు వీరా
నువ్వు నిదుర లేరా!!!

- పేక

============================================
8. ఈ కవిత ఒకరి జన్మదిన కానుక ..
కాని దానికి తగిన పేరు రాలేదు ..
కనీసం మన blog లోకి అయిన పనికి వస్తుందని ఆశిస్తున్నాను.


చిరునవ్వుతో పలుకుతుంది ఆహ్వానం
మెండుగా ఉంది తనలో ఆత్మాభిమానం
నలుగురికి సహాయం చేసే గుణం
దాన ధర్మములకు సంఖోచించదు క్షణం
మిత్రులకు తోడ్పడే స్వభావం
మా అందరిపై ఉంటుంది తన ప్రభావం

అందం చందం, తెలివి చదువు
అరుదైన వనితకు ఇవన్నియును కలవు
తన విచక్షణకు లేదు సెలవు
కల్ల నిజములు కనిపెట్టుట తనకెంతో సులువు

తన శైలి వేరు
తన మనసుకి దారి వేరు
తన మాటలు ప్రవహించే సెలయేరు
తన చూపులకు జనులు ముగ్దులయ్యేరు

కోపం వస్తే హరి హరి
అవుతుంది మన పని సరాసరి

తన మార్గము స్ఫూర్తినిచ్చు
అది కన్న ఎవ్వరైన మెచ్చు

నీ పరిచయం పంచెను ఆనందపు జల్లులు
విరిశాయి మనసంతా రంగుల హరివిల్లులు
అధిగమించగలవు ఎట్టివైనా కాలం పెట్టిన పరీక్షలు
అని ఆసిస్తూ , నీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు

-- పేక


============================================

7.
ఈ కవిత వీర శూర కర్ణుడికి అంకితం

వినర వినర ఓ వీర పురుషుడి
కధ
అడుగడుగునా శాప గ్రస్తుడైన ఓ క్షత్రియుడి
వ్యధ

లోకం కనీ విని ఎరుగని దాన వీరుడు
ఇంద్రుడికి సైతం దాన మిచ్చిన దయార్ధ హృదయుడు

రాధేయుడిగా పరిచయమై, సూద్రుని పుత్రుడుగా వ్యాప్తమై
అవమానం భరించెను , కీర్తికై తన మనస్సు తపించెను

పరశురాముడి శిష్యుడు , ఈతండు ధనుర్విద్యలో సర్వశ్రేష్టుడు
ఇతడు సంధించిన శరం కడు వేగం,
అర్జునునికి లేదు వాటికి సమాధానం

అంగ రాజ్యానికి నరేశుడై సుయోధనుడికి రుణబద్ధుడు ,
అధర్మ పక్షాన ధర్మయుద్ధంలో పరాజితుడైన శాపగ్రస్తుడు

అర్జునుడు చేసెను కపటము , ఇతను పలికెను వీరస్వర్గమునకు స్వీకారము
రణరంగంలో ఓ మహావీరుడు నేలకూలేను , అది చూచి
ముల్లోకాలు తల్లడిల్లెను

ఆతండి స్నేహభావం కావాలి మనకి ఆదర్శం
విషపూరితమైన నేటి సమాజంలో కర్ణ నామమే మన నినాదం

-- పేక (పేరు లేని కవి)
============================================
6.
ఇది నా ప్రియ మిత్రుడు సాయి కి అంకితం

ముఖ కవళికల్లో పసి పాపాయి
వాడికి శృతి అంటే హాయి

వినండి వాడి పసి పలుకులు
రుజువు ఇదే వాడి "ఎం జేస్తుల్లు " !!!

- పేక
============================================
5.
ధీరులు శూరులు అవ్వుదురో కాదో
తేనె పలుకులు ఉన్నవో లేవో

భలే ఉంది మన దాదా 'మిత్రులు'
ఇదే మీకు నా రామ నవమి శుభాకాంక్షలు !!
- పేక
============================================
4.
నాకు కూడా పంపండి
కవితల బండి
మనుసుంటే చాలదండి
మెయిల్ అయిడీ ఆడ్ చేయండి !!!

- పేక
============================================
3.
మళ్ళీ మొదలయింది తవికల గోల
ఇంకెన్ని నాళ్ళు సాగుతుందో కల కల
కదం తొక్కే తరుణం మరి ఉండదు మరో క్షణం
రాస్తనంటూ విజిలు వేయిస్తా నంటూ
రాయవేం ఏదయినా

తవిక తో చెప్తున్నా
నువ్వు కూడా రాయి సత్తి అన్నా !!

- పేక
============================================
2.
ఇది చిన్నోడి కధ
మన వాసు గాడి వ్యధ

వాడికెందుకు శాపం
పదాలు దొరకవేం పాపం !!

- పేక
============================================
1.
ఎవరికీ వారే మిన్న
అనుకునే చిన్నా

ఒక్క కవిత్వాన్ని పొగిడే కన్నా
ప్రతి కవిత్వాన్ని ప్రేమించి సరదా పడు నాన్నా !!

- పేక
============================================

No comments:

Post a Comment